క్రీడాభూమి

కివీస్‌ను భారత్ మళ్లీ ఓడిస్తే పాకిస్తాన్ చిత్తే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, సెప్టెంబర్ 27: న్యూజిలాండ్‌తో శుక్రవారం నుంచి కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగే రెండో టెస్టు మ్యాచ్‌ని భారత్ గెల్చుకుంటే, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను దక్కించుకోవడంతోపాటు పాకిస్తాన్‌ను చిత్తుచేస్తుంది. టెస్టు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ ప్రస్తుతం నంబర్ వన్ స్థానంలో నిలవగా, భారత్ రెండో స్థానంలో కొనసాగుతున్నది. కాగా, కివీస్‌తో కాన్పూర్‌లో జరిగిన మొదటి టెస్టులో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా అసాధారణ ప్రతిభ కనబరచడంతో భారత్ 197 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీనితో ఇప్పుడు పాకిస్తాన్ కంటే భారత్ కేవలం ఒక పాయింట్ వెనుకంజలో ఉంది. ఈడెన్ గార్డెన్స్ మైదానంలోనూ టీమిండియా గెలిస్తే, పాక్ నుంచి టెస్టు నంబర్ వన్ హోదాను దక్కించుకుంటుంది. పాక్ 111, భారత్ 110 పాయింట్లతో మొదటి రెండు స్థానాలను ఆక్రమిస్తే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ చెరి 108 పాయింట్లు సంపాదించి, మొదటి రెండు స్థానాలకు తీవ్రంగా పోటీపడుతున్నాయి.
అశ్విన్‌కు కీలకం
స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు కూడా న్యూజిలాండ్‌తో జరిగే రెండో టెస్టు కీలకం కానుంది. బౌలింగ్ జాబితాలో అతను ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన డేల్ స్టెయిన్ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతుండగా, ఇంత వరకూ రెండో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్‌ను అశ్విన్ మూడో స్థానంలోకి నెట్టేశాడు. అతని కంటే ఒక పాయింట్ ముందంజలో ఉన్న అశ్విన్ కోల్‌కతా టెస్టులోనూ రాణిస్తే, స్టెయిన్‌ను కూడా అధిగమించి, నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమిస్తాడు. ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం కోసం టీమిండియాతోపాటు అశ్విన్ కూడా రేసులో ఉన్నందువల్ల అందరూ ఈ టెస్టుపైనే దృష్టి పెడుతున్నారు.
250వ టెస్టు
ఈడెన్ గార్డెన్స్ మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగే రెండో మ్యాచ్‌తో భారత్ 250వ టెస్టు మైలురాయిని చేరుతుంది. అందుకే, ఈ టెస్టులో చిరస్మరణీయ విజయాన్ని సాధించాలన్న పట్టుదలతో కోహ్లీ సేన ఉంది. కాన్పూర్‌లో 500వ టెస్టు ఆడి, గెలిచిన భారత జట్టు స్వదేశంలో ఆడనున్న 250వ టెస్టు విజయంపై కనే్నసింది. కాగా, దీనిని కలకాలం గుర్తుండిపోయే విధంగా నిర్వహించేందుకు బెంగాల్ క్రికెట్ సంఘం (సిఎబి) సన్నాహాలు చేస్తున్నది. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న సిఎబి ఈ టెస్టును ‘క్రికెట్ మక్కా’ లార్డ్స్ మైదానంలో మాదిరి గంట కొట్టడంతో మొదలుపెట్టాలని నిర్ణయించింది. ఆ అవకాశాన్ని మరో మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌కు ఇచ్చింది.