క్రీడాభూమి

నెట్స్‌లో టీమిండియా బిజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, సెప్టెంబర్ 28: న్యూజిలాండ్‌తో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టు కోసం భారత క్రికెటర్లు ఈడెన్ గార్డెన్స్ మైదానంలో బుధవారం ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు. మొదటి టెస్టులో ఇద్దరు స్పిన్నర్లు అశ్విన్, రవీంద్ర జడేజా రూపంలో జట్టులో ఆడగా, రెండో టెస్టుకు అమిత్ మిశ్రాను కూడా తీసుకుంటారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే మిశ్రా కూడా నెట్స్‌లో చాలా సేపు అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. కోచ్ అనిల్ కుంబ్లే స్వయంగా బౌలర్ కాడంతో, ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాల్సిన ఆవస్యకతను అతను గుర్తుచేస్తున్నట్టు తెలుస్తోంది. అతని పర్యవేక్షణలోనే టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌ను పూర్తి చేసింది. బెంగాల్ క్రికెట్ సంఘం (సిఎబి)కి అధ్యక్షుడిగా సేవలందిస్తున్న భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బుధవారం ఈడెన్ గార్డెన్స్‌లో చాలాసేపు గడిపాడు. కుంబ్లేతో ముచ్చటిస్తూ, అతనికి కొన్ని సూచనలు కూడా చేశాడు. వీరిద్దరూ క్యూరేటర్ సుజన్ ముఖర్జీతో మాట్లాడడం కనిపించింది. అనంతరం మిశ్రాతో కుంబ్లే ఎక్కువ సేపు బౌలింగ్ చేయించడం గమనార్హం. కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఆజింక్య రహానే తదితరులు నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. వృద్ధిమాన్ సాహా కూడా కొంత సేపు కీపింగ్, మరికొంత సేపు బ్యాటింగ్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు.
గంభీర్ డౌటే!
రెండో టెస్టులో గౌతం గంభీర్‌కు అవకాశం దక్కడం అనుమానంగానే కనిపిస్తున్నది. ఈ స్టేడియంలో రోహిత్ 264 పరుగులు సాధించి వనే్డ ఇంటర్నేషనల్స్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తనకు అచ్చొచ్చిన ఈడెన్ గార్డెన్స్‌లో మరోసారి విశ్వరూపాన్ని చూపాలని అతను తహతహలాడుతున్నాడు. అతనినే ఓపెనర్‌గా పంపే ఆలోచనలో ఉన్నట్టు కుంబ్లే పరోక్షంగా చెప్పాడు. దీనితో, సుమారు రెండేళ్ల విరామం తర్వాత టీమిండియాలోకి వచ్చిన గంభీర్‌కు రెండో టెస్టు ఆడే తుది జట్టులో అవకాశం దక్కకపోవచ్చన్న అనుమానం తలెత్తుతోంది.
అశ్విన్, జడేజా గైర్హాజరు
కాన్పూర్ టెస్టులో తమ మధ్య మొత్తం 16 వికెట్లు పంచుకొని, న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా బుధవారం నాటి ప్రాక్టీస్ సెషన్‌కు హాజరుకాలేదు. వారు విశ్రాంతి తీసుకోగా, మరో స్పిన్నర్ అమిత్ మిశ్రా చాలాసేపు నెట్స్‌లో పాల్గొన్నాడు.