క్రీడాభూమి

లిఫ్ట్‌లో చిక్కుకున్న దాదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, సెప్టెంబర్ 29: బెంగాల్ క్రికెట్ సంఘం (సిఎబి)కి అధ్యక్షుడిగా ఉన్న ‘కోల్‌కతా ప్రిన్స్’ సౌరవ్ గంగూలీ గురువారం లిఫ్ట్‌లో చిక్కుకుపోయాడు. సిబ్బంది వెంటనే స్పందించడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మొదటి అంతస్థులో ఉన్న సిఎబి కార్యాలయానికి వెళ్లడానికి దాదా లిఫ్ట్ ఎక్కాడు. అయితే, అది మధ్యలోనే ఆగిపోయింది. ఈ విషయాన్ని గమనించిన సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఒక స్టూల్‌ను పై భాగం నుంచి లోపలికి జారవిడిచారు. గంగూలీ దానిని ఎక్కి, బయటపడ్డాడు. 1987లో చేపట్టిన భవన మరమ్మతుల సమయంలో ఏర్పాటు చేసిన లిఫ్ట్ కావడంతో దానికి సాంకేతిక పరమైన ఇబ్బందులు తలెత్తాయని సిఎబి ఒక ప్రకటనలో తెలిపింది.