క్రీడాభూమి

ఈడెన్‌లో మూడోటెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, సెప్టెంబర్ 29: కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్‌తో శుక్రవారం నుంచి రెండో టెస్టు ఆడుతుంది. అయతే, ఈ రెండు జట్ల మధ్య ఈడెన్‌లో ఇది ముచ్చటగా మ్యాచ్. ఇది భారత్‌కు స్వదేశంలో 250వ టెస్టుకావడం విశేషం. న్యూజిలాండ్‌తో ఈడెన్‌లో భారత్ ఇంతకు ముందు ఆడిన రెండు టెస్టులు డ్రా అయ్యాడు. ముచ్చటగా మూడోసారి కూడా కివీస్ మ్యాచ్‌ని డ్రా చేసుకొని, సిరీస్‌పై ఆశలు నిలబెట్టుకుంటుందో లేక ఓటమిపాలై, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌కు అప్పగిస్తుందో చూడాలి. ప్రతిష్ఠాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో భారత్ మొట్టమొదటిసారి 1955 డిసెంబర్ 28 నుంచి 1956 జనవరి 2వ తేదీ వరకు జరిగిన టెస్టులో న్యూజిలాండ్‌ను ఢీ కొంది. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 132 పరుగులకే ఆలౌట్‌కాగా, న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 336 పరుగులు సాధించింది. జాన్ రీడ్ 120 పరుగులు చేయగా, జాన్ గే 91 పరుగులు చేశాడు. అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 438 పరుగులు నమోదు చేసింది. పంకజ్ రాయ్ (100), రామచందర్ (106 నాటౌట్) శతకాలతో రాణించారు. విజయానికి 235 పరుగులు సాధించాల్సిన న్యూజిలాండ్ చివరి రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లకు 75 పరుగులు చేసింది. మ్యాచ్ డ్రా అయింది.
భారత్, కివీస్ ఈడెన్ గార్డెన్స్‌లో రెండోసారి 1965 మార్టి 5 నుంచి 8వ తేదీ వరకు జరిగిన టెస్టులో తలపడ్డాయి. ఈ టెస్టు కూడా డ్రాగా ముగిసింది. న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేసింది. భారత్ కూడా ఎదురుదాడికి దిగి, 380 పరుగులు సాధించగలిగింది. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ 153 పరుగులు చేసి ప్రేక్షకులను అలరించాడు. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 191 ప రుగుల వద్ద డిక్లేర్ చేసింది. భారత్ 274 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆ రంభించి, మ్యాచ్ డ్రాగా ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది.
విండీస్ చిత్తు
ఈడెన్ గార్డెన్స్‌లో భారత్ చివరి టెస్టును వెస్టిండీస్‌తో ఆడింది. 2013 నవంబర్ 6 నుంచి 8వ తేదీ వరకు జరిగిన ఆ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 51 పరుగుల భారీ తేడాతో విజయభేరి మోగించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 234 పరుగులు చేసింది. అందుకు సమాధానంగా భారత్ 453 పరుగుల భారీ స్కోరు సాధించింది. రోహిత్ శర్మ 177 పరుగులతో అదరగొట్టాడు. అశ్విన్ 124 పరుగులు చేశాడు. వీరిద్దరి సెంచరీలతో భారత్ 219 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించుకోవడానికి విండీస్ విశ్వయత్నం చేసినప్పటికీ ఫలితంలేక పోయింది. ఆ జట్టు కేవలం 168 పరుగులకే కుప్పకూలడంతో, టీమిండియా ఇన్నింగ్స్ విజయాన్ని నమోదు చేసింది.
కోహ్లీ సేనకే విజయావకాశాలు
న్యూజిలాండ్‌తో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టులోనూ విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని విభాగాల్లోనూ జట్టు పటిష్టంగా కనిపిస్తున్నది. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుందా? లేదా? అనే ప్రశ్నలను పక్కకుపెడితే, టీమిండియా మంచి ఫామ్‌ను కొనసాగిస్తున్నది. మ్యాచ్ ఆడే తుది 11 మంది పేర్లను ఖరారు చేయడానికి జట్టు మేనేజ్‌మెంట్ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. లోకేష్ రాహుల్ గాయం కారణంగా జట్టులోకి వచ్చిన గౌతం గంభీర్‌కు కూడా తుది జట్టులో స్థానం దక్కడం అనుమానంగా ఉందంటే, ఆటగాళ్ల ఫామ్ ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. టీమిండియాతో పోలిస్తే న్యూజిలాండ్ ఏ రకంగానూ గట్టిపోటీనిచ్చే పరిస్థితిలో లేదు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆ జట్టు గెలవడం అసాధ్యం. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ కాన్పూర్ టెస్టును గెల్చుకొని 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. రెండో టెస్టు కూడా గెలిస్తే, సిరీస్ కైవసం చేసుకుంటుంది.

సూపర్ లక్ష్మణ్
కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ కింగ్‌గా వివిఎస్ లక్ష్మణ్‌కు పేరుంది. అతను ఈ మైదానంలో 10 మ్యాచ్‌ల్లో 1,217 పరుగులు చే శాడు. రాహుల్ ద్రవిడ్ 962, సచిన్ తెండూల్కర్ 872 పరుగులతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. విదేశీ బ్యాట్స్‌మెన్‌లో వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ రోహన్ కన్హాయ్‌ది అగ్రస్థానం. అతను రెండు ఇన్నింగ్స్‌లో 346 పరుగులు సాధించాడు.
* ఇక్కడ ఒక ఇన్నింగ్స్‌లో ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌కూడా లక్ష్మణే కావడం విశేషం. అతను 2001 మార్చిలో ఆస్ట్రేలియాపై 281 పరుగులు సాధించాడు. మరో ఇద్దరు మాత్రమే ఇక్కడ డబుల్ సెంచరీలు చేశారు. రోహన్ కన్హాయ్ (వెస్టిండీస్), వసీం జాఫర్ (్భరత్) ఈ ఘనతను అందుకున్నారు.
* ఈ మైదానంలో ఎక్కువ సెంచరీలు చేసిన రికార్డును మహమ్మద్ అజరుద్దీన్‌తో కలిసి లక్ష్మణ్ పంచుకుంటున్నాడు. ఇద్దరూ చెరి ఐదు పర్యాయాలు ఈడెన్ గార్డెన్స్‌లో శతకాలు నమోదు చేశారు.
భారత్ ఆధిక్యం
ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన టెస్టుల్లో, ఒక ఇన్నింగ్స్‌లో 600 లేదా అంతకు మించి పరుగులు ఆరు పర్యాయాలు నమోదయ్యాయి. వీటిలో ఐదు భారత్ చేసినవే కావడం విశేషం. ఒకసారి వెస్టిండీస్ ఈ ఘనతను సాధించింది. అత్యధిక స్కోరు కూడా భారత్‌దే. 2001 మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో టీమిండియా ఏడు వికెట్లకు 657 పరుగులు చేసింది.
అత్యధికమే కాదు.. అత్యల్ప స్కోరులోనే భారత్‌దే రికార్డు. 1983 డిసెంబర్ 10న వెస్టిండీస్‌తో ఆడుతూ టీమిండియా కేవలం 90 పరుగులకే ఆలౌటైంది. ఈ జాబితాలో తర్వాతి ఐదు స్థానాలు కూడా భారత్‌వే కావడం విశేషం.