క్రీడాభూమి

దారికొచ్చిన బోర్డు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 29: లోధా కమిటీ సిఫార్సుల అమలుపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించడంతో భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసి) దారికొచ్చినట్టు కనిపిస్తున్నది. శుక్రవారం ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జిఎం)ను నిర్వహించనుంది. ఈ సమావేశంలో లోధా కమిటీ చేసిన ప్రతిపాదనలను అమలు చేయాలని తీర్మానించే అవకాశం ఉంది. బోర్డు పాలనా వ్యవహారాలన్నీ పారదర్శకంగా జరగాలన్న ఉద్దేశంతో లోధా కమిటీ పలు ప్రతిపాదనలు చేసిన విషయం తెలిసిందే. అయితే, వాటిని అమలు చేయడానికి సుముఖంగా లేని బిసిసిఐ నాన్చివేత ధోరణిని ప్రదర్శిస్తూ వచ్చింది. అంతటితో ఆగకుండా ఈనెల 21న జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజిఎం)లో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంది. లోధా సిఫార్సులను తుంగలో తొక్కే రీతిలో ప్రధాన కార్యదర్శి ఎన్నిక ప్రక్రియను పూర్తి చేసింది. అజయ్ షిర్కేను ఏకగ్రీవంగా కార్యదర్శి పదవికి ఎన్నుకుంది. ముగ్గురు సభ్యులతో సెలక్షన్ కమిటీ ఉండాలని లోధా కమిటీ స్పష్టం చేసినప్పటికీ పట్టించుకోకుండా, ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించింది. సిఫార్సుల అమలును వాయిదా వేయడమేగాక, డెడ్‌లైన్లను పట్టించుకోకుండా మూర్ఖంగా వ్యవహరించడం, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సహజంగానే ఆర్‌ఎం లోధా అధ్యక్షతన రవీంద్రన్, అశోక్ భాన్ సభ్యులుగా గల కమిటీని ఆగ్రహానికి గురి చేసింది. బిసిసిఐతో అమీతుమీ తేల్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చిన తర్వాత, బుధవారం సుప్రీం కోర్టుకు స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పించిన విషయం తెలిసిందే. బోర్డు వ్యవహార శైలిని ఎండగట్టిన కమిటీ, ప్రస్తుత పాలక వర్గాన్ని రద్దు చేయాలని కూడా సుప్రీం కోర్టును కోరింది.
దారిలోకి తెస్తామన్న కోర్టు
లోధా కమిటీ సమర్పించిన స్టేటస్ రిపోర్ట్‌పై స్పందించిన సుప్రీం కోర్టు తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ చేసింది. దారిలోకి రావాలని, లేకపోతే, దారిలోకి తెచ్చుకుంటామని స్పష్టం చేసింది. లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయడానికి అక్టోబర్ 5వ తేదీ వరకు గడువునిచ్చింది. బిసిసిఐ తనను తాను చట్టానికి అతీతమని భావించరాదని హితవు పలికింది.
బోర్డు రాజీ సూత్రం?
సుప్రీం కోర్టు ఈ విధంగా తీవ్రంగా స్పందించడంతో బిసిసిఐ రాజీ సూత్రాన్ని అనుసరిస్తున్నదని విశే్లషకుల అభిప్రాయం. లోధా సిఫార్సులను అమలు చేయకపోతే, మొత్తానికే మోసం వస్తుందని బోర్డు భయపడుతున్నది. అందుకే, హడావుడిగా ఎస్‌జిఎంను ఆహ్వానించింది. ఈ సమావేశంలో లోధా సిఫార్సుల అమలుపై అధికారికంగా తీర్మానాన్ని ఆమోదిస్తుందని సమాచారం. ఇప్పటి వరకూ ఏడు పర్యాయాలు లోధా కమిటీ డెడ్‌లైన్స్‌ను విధించినా పట్టించుకోని బిసిసిఐకి ఇప్పుడు సుప్రీం కోర్టు నేరుగా ఆదేశాలు జారీ చేయడంతో ప్రత్యామ్నాయ మార్గం లేకుండా పోయింది. లోధా కమిటీతో రాజీ పడకపోతే, సుప్రీం కోర్టు కఠినమైన ఆదేశాలు జారీ చేసే ప్రమాదం ఉందని బోర్డుకు ఇప్పటికే స్పష్టమైంది. అందుకే, శుక్రవారం నాటి ఎస్‌జిఎంలో కీలక తీర్మానాలను ఆమోదించడానికి రంగం సిద్ధం చేసుకుంది. సుప్రీం కోర్టు ఇచ్చిన గడువు సమీపిస్తుండడంతో లోధా ప్రతిపాదనల అములకే బోర్డు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.