క్రీడాభూమి

క్రమశిక్షణలేని సిద్ధు, అజయ్ జడేజా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, సెప్టెంబర్ 30: తనతో కలిసి క్రికెట్ ఆడిన వారిలో క్రమశిక్షణ ఏమాత్రం లేని ఆటగాళ్ల పేర్లను చెప్పమంటే, ముందుగా నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు, అజయ్ జడేజా పేర్లే ఉంటాయని మరో మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. చివరి క్షణాల్లో బట్టలు సర్దుకొని వచ్చేవారని, అందుకే ఒక్కో జతను చాలాసార్లు వేసుకునేవారని చెప్పాడు. వాళ్లిద్దరినీ ‘చెత్త’ అంటే అభ్యంతరాలు వ్యక్తం కావచ్చుగానీ, నిజానికి వారు అలాంటి వారేనని అన్నాడు. 1970, 1980 దశకాల్లో భారత క్రికెట్ ఆలోచనా విధానం సరిగ్గా ఉండేది కాదని అన్నాడు. మైదానంలో దూకుడుగా వ్యవహరించే పద్దతి గంగూలీతోనే మొదలైందని చెప్పాడు. బ్యాటింగ్ లేదా ఫీల్డింగ్‌లో దూకుడుగా ఉండడం కేవలం ఉత్తర భారత దేశ క్రికెటర్లకే ప్రత్యేకమని అనుకునేవాడినని, కానీ, గంగూలీ తన అభిప్రాయాన్ని మార్చేశాడని తెలిపాడు. దక్షిణ భారత క్రికెటర్లు ఎప్పుడూ నింపాదిగా ఉండేవారని, కానీ, కుంబ్లే చాలా దూకుడుగా వ్యవహరించేవాడని కపిల్ అన్నాడు.
కెప్టెన్లు ప్రోత్సహించారు: సెవాగ్
కెప్టెన్లు ప్రోత్సహించారని, అందుకే తాను ఎలాంటి భయాందోళనలు లేకుండా బ్యాటింగ్ చేసేవాడినని సెవాగ్ అన్నాడు. 2008లో దక్షిణాఫ్రికాతో సిరీస్ ఆడుతున్నప్పుడు, అప్పటి కెప్టెన్ అనిల్ కుంబ్లే తన వద్దకు వచ్చి, బాగా ఆడినా, ఆడకపోయినా నాలుగు టెస్టుల్లోనూ ప్లేయింగ్ ఎలెవెన్‌లో స్థానం ఉంటుందని హామీ ఇచ్చాడని తెలిపాడు. అందుకే ఏమాత్రం ఒత్తిడి లేకుండా ఆడగలిగానని, చెన్నై టెస్టులో ట్రిపుల్ సెంచరీ సాధించగలిగానని తెలిపాడు. గంగూలీ, కుంబ్లే, మహేంద్ర సింగ్ ధోనీ వంటి కెప్టెన్లు ఉన్నారు కాబట్టే చాలా మంది ఆటగాళ్లు అంతర్జాతీయ ప్రమాణాలను అందుకున్నారని చెప్పాడు.