క్రీడాభూమి

ముంచుకొస్తున్న గడువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 30: లోధా కమిటీ సిఫార్సుల అమలుపై ఒక నిర్ణయం తీసుకోవడానికి శుక్రవారం జరగాల్సిన భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జిఎం) వాయిదా పడింది. లోధా కమిటీ చేసిన ప్రతిపాదనలను అమలు చేయకుండా తాత్సారం చేస్తున్న బిసిసిఐపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించడంతో బిసిసిఐ ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించాల్సిన అవసరం ఏర్పడింది. దీనికి తోడు తొలి విడత సిఫార్సుల అమలుకు సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించడానికి సుప్రీం కోర్టు ఇచ్చిన గడువు శుక్రవారంతో ముగిసింది. అందుకే హడావుడిగా ఎస్‌జిఎంను ఏర్పాటు చేసినప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాలతో సమావేశం ఒక రోజు వాయిదా పడింది. ఈ సమావేశంలో లోధా కమిటీ చేసిన ప్రతిపాదనల అమలుపై బిసిసిఐ తీర్మానాన్ని ఆమోదించాలి. మొదటి విడత సిఫార్సుల అమలుకు అనుగుణంగా సంస్థ నిబంధనావళిని కూడా మారుస్తూ తీర్మానాన్ని ఆమోదించాలి. లోధా కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడంతో సుప్రీం కోర్టు ఆగ్రహానికి బిసిసిఐ గురైంది. ఏదో ఒక రకంగా బయటపడకపోతామా అన్న ధీమాతో ఇన్నాళ్లూ సిఫార్సుల అమలును వాయిదా వేసిన బోర్డు ఇప్పుడు పూర్తిగా మునిగిపోయింది. ఈ పరిస్థితుల్లో బోర్డు స్పందన ఏ విధంగా ఉంటుందనే విషయంపై నెలకొన్న సస్పెన్స్‌కు ఎస్‌జిఎం వాయిదా కారణంగా తెరపడలేదు. శనివారం నాటి సమావేశంలో నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
అడకత్తెరలో బిసిసిఐ
లోధా కమిటీ చేసిన సిఫార్సుల అమలుపై బిసిసిఐ ఎటూ నిర్ణయించుకోలేక పోతున్నది. సిఫార్సులు అమలు చేస్తే, భారత క్రికెట్‌పై దశాబ్దాలుగా కొనసాగిస్తున్నా ఆధిపత్యాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అమలు చేయకపోతే ఏమవుతుందో సుప్రీం కోర్టు ఇప్పటికే తేల్చిచెప్పింది. దీనితో ఏం చేయాలో తెలియక బోర్డు మల్లగుల్లాలు పడుతున్నారు. పరిస్థితి జటిలంగా మారడానికి బోర్డు అధికారుల స్వయంకృతమే ప్రధాన కారణం. లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయాలంటూ సుప్రీం కోర్టు ఒకవైపు స్పష్టం చేస్తున్నా, మరోవైపు తమ మొండి వైఖరిని ప్రదర్శించిన బోర్డు అధికారులు ఈనెల 21న జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజిఎం)లో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు. లోధా సిఫార్సులకు విరుద్ధంగా ప్రధాన కార్యదర్శిగా అజయ్ షిర్కేను ఎన్నుకోవడమేగాక, ఐదుగురు సభ్యులతో జాతీయ సెలక్షన్ కమిటీని నియమించింది. సెలక్షన్ కమిటీలో బోర్డు తరఫున ముగ్గురే ఉండాలని లోధా కమిటీ స్పష్టం చేసినప్పటికీ అధికారులు ఖాతరు చేయలేదు. సిఫార్సుల అమలు చేయకుండా, డెడ్‌లైన్లను పట్టించుకోకుండా బోర్డు అధికారులు వ్యవహరిస్తున్న తీరును ఆర్‌ఎం లోధా చైర్మన్‌గా ఉన్న కమిటీ తప్పుపట్టింది. లోధాతోపాటు కమిటీలో సభ్యులుగా ఉన్న రవీంద్రన్, అశోక్ భాన్ కూడా బోర్డు అధికారుల వైఖరిని ఎండగడుతూ సుప్రీం కోర్టుకు స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పించడంతో శర వేగంగా సరికొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. కోర్టు ధిక్కారానికి పాల్పడుతున్న ప్రస్తుత కమిటీని రద్దు చేయాలని వారు చేసిన సూచనపై సుప్రీం కోర్టు తీవ్రంగానే స్పందించిన విషయం తెలిసిందే. బిసిసిఐ చట్టానికి అతీతం కాదని కోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికైనా దారిలోకి రాకపోతే ఎలా దారిలోకి తెచ్చుకోవాలో తమకు తెలుసునని హెచ్చరించింది. తొలి విడత సిఫార్సుల అమలుపై నిర్ణయాన్ని ప్రకటించడానికి శుక్రవారం వరకు గడువునిచ్చింది. అక్టోబర్ ఐదో తేదీలోగా పూర్తి స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడానికి, లోధా కమిటీ సిఫార్సుల అమలుపై పట్టుబట్టడానికి బోర్డు అధికారుల అతి ధోరణులే కారణమన్నది వాస్తవం.