క్రీడాభూమి

కివీస్ వెన్నువిరిచిన భువీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, అక్టోబర్ 1: న్యూజిలాండ్‌తో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో జరుగుతున్న రెండో టెస్టు క్రికెట్ మ్యాచ్‌లో భారత జట్టు రెండో రోజే పట్టు బిగించింది. శుక్రవారం మధ్యాహ్న భోజన విరామం తర్వాత వర్షం వలన కొద్దిసేపు ఆటకు అంతరాయం ఏర్పడినప్పటికీ పేసర్ భునవనేశ్వర్ కుమార్ (5/33) నిప్పులు చెరిగే బంతులతో కివీస్ వెన్ను విరిచా భారత జట్టును పటిష్ఠ స్థితికి చేర్చాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు నష్టపోయి 128 పరుగులు సాధించిన న్యూజిలాండ్ జట్టు టీమిండియా కంటే ఇంకా 188 పరుగులు వెనుకబడి ఉంది.
అంతకుముందు 7 వికెట్ల నష్టానికి 239 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం రెండో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత జట్టులో నైట్ వాచ్‌మన్ రవీంద్ర జడేజా 14 పరుగులు సాధించి నీల్ వాగ్నర్ బౌలింగ్‌లో మ్యాట్ హెన్రీకి క్యాచ్ ఇవ్వగా, అతని స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన భువనేశ్వర్ కుమార్ కేవలం 5 పరుగుల వ్యక్తిగత స్కోరుకే సాంట్నర్ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా నిష్క్రమించాడు. అయితే మరో నైట్ వాచ్‌మన్ వృద్ధిమాన్ సాహా కివీస్ బౌలర్లను సమర్ధవంతంగా ప్రతిఘటించి అజేయ అర్ధ శతకంతో రాణించాడు. చివరి వికెట్‌కు 35 పరుగులు జోడించిన తర్వాత మహమ్మద్ షమీ (14) ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో మ్యాట్ హెన్రీకి దొరికిపోగా, వృద్ధిమాన్ సాహా 54 పరుగుల వ్యక్తిగ స్కోరుతో అజేయంగా నిలిచాడు. దీంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 316 పరుగుల స్కోరుకు ఆలౌటైంది.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు భారత బౌలర్లను ఎదుర్కోవడంలో మరోసారి ఘోరంగా విఫలమైంది. మహమ్మద్ షమీ రెండో ఓవర్‌లోనే నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ టామ్ లాథమ్ (1)ను లెగ్ బిఫోర్ వికెట్‌గా పెవిలియన్‌కు చేర్చి కివీస్‌ను తొలి దెబ్బ తీయగా, ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ (13)తో పాటు హెన్రీ నికోలస్ (1) వికెట్లను కైవసం చేసుకున్నాడు. ఈ తరుణంలో కెప్టెన్ రాస్ టేలర్, ల్యూక్ రోంచి స్థిమితంగా ఆడి కివీస్‌ను ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ వారి ప్రయత్నాలు ఎంతోసేపు ఫలించలేదు. 35 పరగులు సాధించిన తర్వాత రోంచి వికెట్‌ను రవీంద్ర జడేజా కైవసం చేసుకోగా, మరోసారి నిప్పులు చెరిగే బంతులతో విజృంభించిన భువనేశ్వర్ కుమార్ వరుసగా టేలర్ (36), మిచెల్ సాంట్నర్ (11), హెన్రీ (0)లను పెవిలియన్‌కు చేర్చాడు. అయితే శుక్రవారం ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ వికెట్ కీపర్ బిజె.వాట్లింగ్ (12), జీతన్ పటేల్ (5) అజేయంగా నిలువడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 34 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 128 పరుగులు రాబట్టింది.
సంక్షిప్తంగా స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్: 316 ఆలౌట్
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 128/7 (రాస్ టేలర్ 36, ల్యూక్ రోంచి 35, మార్టిన్ గుప్టిల్ 13, బిజె.వాట్లింగ్ 12-నాటౌట్, మిచెల్ సాంట్నర్ 11, జీతన్ పటేల్ 5-నాటౌట్).
వికెట్ల పతనం: 1-10, 2-18, 3-23, 4-85, 5-104, 6-122, 7-122. బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 5/33, రవీంద్ర జడేజా 1/17, మహమ్మద్ షమీ 1/46.

చిత్రం.. భునవనేశ్వర్ కుమార్ (5/33)