క్రీడాభూమి

బలమైన స్థితిలో భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, అక్టోబర్ 2: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌పై భారత్ పట్టుబిగించింది. మ్యాచ్ మూడోరోజు, ఆదివారం ఆట ముగిసే సమయానికి ఎనిమిది వికెట్లకు 227 పరుగులు సాధించి, మొత్తం 339 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంకా రెండు వికెట్లు చేతిలో ఉన్నాయి. అంతకు ముందు న్యూజిలాండ్ ఏడు వికెట్లకు 128 పరుగుల వద్ద ఆటను కొనసాగించి, తన తొలి ఇన్నింగ్స్‌లో 204 పరుగులకు ఆలౌటైంది. చివరిలో జీతన్ పటేల్ (47 బంతుల్లో 47 పరుగులు) కొంత సేపు భారత బౌలింగ్‌ను ప్రతిఘటించడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. భువనేశ్వర్ కుమార్ 48 పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టగా, మరో ఫాస్ట్ బౌలర్ మహమ్మ్ షమీ 70 పరుగులిచ్చి మూడు వికెట్లు కూల్చాడు. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ చెరొక వికెట్ తమ తమ ఖాతాల్లో వేసుకున్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో 112 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టి 12 పరుగుల స్కోరువద్ద మురళీ విజయ్ (7) వికెట్‌ను కోల్పోయింది. టాప్ ఫామ్‌లో ఉన్న చటేశ్వర్ పుజారా ఈ ఇన్నింగ్స్‌లో విఫమై, నాలుగు పరుగులకే వెనుదిరిగాడు. అతనిని మాట్ హెన్రీ ఎల్‌బిగా అవుట్ చేశాడు. చేతికి గాయం తగలడంతో ఏకాగ్రతను కోల్పోయిన శిఖర్ ధావన్ కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. అతను 32 బంతులు ఎదుర్కొని, 17 పరుగులు చేసి ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ఎల్‌బి అయ్యాడు. మరో స్టార్ ఆటగాడు ఆజింక్య రహానే ఒక పరుగుకే వెనుదిరిగాడు. ట్రెంట్ బౌల్ట్ క్యాచ్ అందుకోగా మాట్ హెన్రీ అతనిని అవుట్ చేశాడు. జట్టును ఆదుకునే బాధ్యతను స్వీకరించిన విరాట్ కోహ్లీ భారీ స్కోరు చేసే ఊపుమీద కనిపించాడు. కానీ, అతను 65 బంతుల్లో 45 పరుగులు చేసి ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ఎల్‌బిగా పెవిలియన్ చేరాడు. అశ్విన్ (5) వికెట్ కూడా తొందరగానే కూలింది. క్రీజ్‌లో నిలదొక్కుకొని, 132 బంతుల్లో 82 పరుగులు చేసిన రోహిత్ శర్మ శతకం పూర్తికాకుండానే ల్యూక్ రోన్చీ బౌలింగ్‌లో మిచెల్ సాంట్నర్‌కు చిక్కాడు. జడేజా ఆరు పరుగులు చేసి, సాంట్నర్ బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్ ఆటగాడు నీషమ్ క్యాచ్ అందుకోవడంతో అవుటయ్యాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఎనిమిది వికెట్లు చేజార్చుకొని 227 పరుగులు చేసింది. అప్పటికీ వృద్ధిమాన్ సాహా (28), భువనేశ్వర్ కుమార్ (8) క్రీజ్‌లో ఉన్నారు. ప్రత్యర్థి కంటే ఇప్పటికే 339 పరుగులు ఆధిక్యంలో ఉన్న భారత్ ఇంకా రెండు రోజు ఆట మిగిలి ఉండడంతో మ్యాచ్‌ని గెలిచే అవకాశాలను మెరుగుపరచుకుంది.

స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: 104.5 ఓవర్లలో 316 ఆలౌట్ (చటేశ్వర్ పుజారా 87, రహానే 77, వృద్ధిమాన్ సాహా 54 నాటౌట్, మాట్ హెన్రీ 3/46, ట్రెంట్ బౌల్ట్ 2/46, వాగ్నర్ 2/57, జీతన్ పటేల్ 2/66).
న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 7 వికెట్లకు 128): మార్టిన్ గుప్టిల్ బి భువనేశ్వర్ కుమార్ 13, టామ్ లాథమ్ ఎల్‌బి మహమ్మద్ షమీ 1, హెన్రీ నికోలస్ బి భువనేశ్వర్ కుమార్ 1, రాస్ టేలర్ సి మురళీ విజయ్ బి భువనేశ్వర్ కుమార్ 36, ల్యూక్ రోన్చీ ఎల్‌బి రవీంద్ర జడేజా 35, మిచెల్ సాంట్నర్ ఎల్‌బి భువనేశ్వర్ కుమార్ 11, బ్రాడ్లే వాల్టింగ్ ఎల్‌బి మహమ్మద్ షమీ 25, మాట్ హెన్రీ బి భువనేశ్వర్ కుమార్ 0, జీతన్ పటేల్ సి మహమ్మద్ షమీ బి అశ్విన్ 47, నీల్ వాగ్నర్ ఎల్‌బి మహమ్మద్ షమీ 10, ట్రెంట్ బౌల్ట్ నాటౌట్ 8, ఎక్‌స్ట్రాలు 19, మొత్తం (53 ఓవర్లలో ఆలౌట్) 204.
వికెట్ల పతనం: 1-10, 2-18, 3-23, 4-85, 5-104, 6-122, 7-122, 8-182, 9-187, 10-204.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 15-2-48-2, మహమ్మద్ షమీ 18-1-703, రవీంద్ర జడేజా 12-4-40-1, రవిచంద్రన్ అశ్విన్ 8-3-33-1.
భారత్ రెండో ఇన్నింగ్స్: శిఖర్ ధావన్ ఎల్‌బి ట్రెంట్ బౌల్ట్ 17, మురళీ విజయ్ సి మర్టిన్ గుప్టిల్ బి మాట్ హెన్రీ 7, చటేశ్వర్ పుజారా ఎల్‌బి మాట్ హెన్రీ 4, విరాట్ కోహ్లీ ఎల్‌బి ట్రెంట్ బౌల్ట్ 45, ఆజింక్య రహానే సి ట్రెంట్ బౌల్ట్ బి మాట్ హెన్రీ 1, రోహిత్ శర్మ సి ల్యూక్ రోన్చీ బి మిచెల్ సాంట్నర్ 82, అశ్విన్ ఎల్‌బి మిచెల్ సాంట్నర్ 5, వృద్ధిమాన్ సాహా 39 నాటౌట్, రవీంద్ర జడేజా సి సబ్‌స్టిట్యూట్ (నీషమ్) బి మిచెల్ సాంట్నర్ 6, భువనేశ్వర్ కుమార్ 8 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 13, మొత్తం (63.2 ఓవర్లలో 8 వికెట్లకు 227).
వికెట్ల పతనం: 1-12, 2-24, 3-34, 4-43, 5-19, 6-106, 7-209, 8-215.
బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ 14-5-28-2, మాట్ హెన్రీ 15.2-2-44-3, నీల్ వాగ్నర్ 13-2-43-0, జీతన్ పటేల్ 8-0-50-0, మిచెల్ సాంట్నర్ 13-1-51-3.

న్యూజిలాండ్‌తో
టీమిండియా
రెండో
క్రికెట్ టెస్టు