క్రీడాభూమి

డబ్బు లేకుండా ఆట సాగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: డబ్బులు లేకపోతే ఆటను నిర్వహించలేమని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ మంగళవారం నిర్ద్వంద్వంగా స్పష్టం చేశాడు. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న టెస్టు సిరీస్ భవితవ్యం ఏమిటన్నదీ చెప్పేందుకు ఆయన నిరాకరించాడు. బిసిసిఐ ఖాతాలను స్తంభింపజేయాల్సిందిగా బ్యాంకులను తాము ఆదేశించలేదని జస్టిస్ లోధా కమిటీ వివరణ ఇచ్చినప్పటికీ అనురాగ్ ఠాకూర్ పై వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్‌ల నిర్వహణకు బిసిసిఐపై ఆధారపడి ఉన్న రాష్ట్ర సంఘాలకు నిధులను విడుదల చేసేందుకు అనుమతించకపోవడం విచారకరమని ఆయన అన్నాడు. ‘్భరత్, న్యూజిలాండ్ జట్ల మధ్య సిరీస్ కొనసాగుతుందా? లేదా? అనే విషయాన్ని నేను చెప్పలేను. కానీ ప్రపంచ టెస్టు క్రికెట్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు అగ్రస్థానంలోనూ, ట్వంటీ-20 ర్యాంకింగ్స్‌లో ద్వితీయ స్థానంలోనూ, వనే్డ ర్యాకింగ్స్‌లో తృతీయ స్థానంలోనూ కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఆటగాళ్లకు, రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు డబ్బులు చెల్లించకపోతే తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతాయి. బిసిసిఐ ప్రపంచంలోనే ఎంతో శక్తిమంతమైన క్రికెట్ బోర్డు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక టోర్నమెంట్లను మేము విజయవంతంగా నిర్వహించాం. ఏది ఏమైనప్పటికీ డబ్బులు లేకుండా మేము ఆటను నిర్వహించలేం’ అని ఠాకూర్ పేర్కొన్నాడు. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గానీ మరెవరి నుంచి గానీ బిసిసిఐ డబ్బులు తీసుకోలేదు. చెల్లింపులను ఆపాల్సిందిగా బ్యాంకులను ఆదేశించారు. ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమవడం విచారకరం. ఇనే్నళ్ల పాటు బిసిసిఐ ఏమీ చేయలేదా? అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది’ అని ఠాకూర్ అన్నారు.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును ప్రక్షాళన చేసేందుకు తాము చేసిన సిఫారసులను పాటించకపోకపోవడం పట్ల జస్టిస్ లోధా కమిటీ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ, బ్యాంకుల్లో బిసిసిఐకి చెందిన ఖాతాల నుంచి రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు ‘అధిక మొత్తం’లో నిధులను విడుదల చేయవద్దని ఆదేశించింది. అయితే టెస్టు క్రికెటర్ల మ్యాచ్ ఫీజును తాము రూ.7 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచిన తరుణంలో బ్యాంకులకు ఇటువంటి ఆదేశాలను జారీ చేయడం బిసిసిఐపై ప్రశ్నలను లేవనెత్తుతోందని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. ప్రస్తుత దేశవాళీ సీజన్‌లో మ్యాచ్‌లను ఎలా నిర్వహించాలన్న దానిపై చాలా రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు పాలుపోవడం లేదని, డబ్బులు ఉన్నా లేకపోయినా మ్యాచ్‌లను నిర్వహించాలా? లేదా? అనే విషయంపై రాష్ట్రాల క్రికెట్ సంఘాలే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ఖాతాలను స్తంభింపజేయలేదు : లోధా
ఇదిలావుంటే, బిసిసిఐ ఖాతాలను స్తంభింపజేయాల్సిందిగా బ్యాంకులకు ఎటువంటి ఆదేశాలనూ జారీ చేయలేదని జస్టిస్ లోధా వివరించారు. ‘బిసిసిఐ ఖాతాలను మేము స్తంభింపజేయలేదు. రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు నిధుల చెల్లింపును ఆపాలని మాత్రమే బ్యాంకులను ఆదేశించాం. అంతేతప్ప బిసిసిఐ ఖాతాలపై పూర్తిగా ఎటువంటి నిషేధాన్ని విధించలేదు. కనుక బిసిసిఐ తన రోజువారీ ఖర్చులు, వ్యవహారాలతో పాటు మ్యాచ్‌లను యథావిధిగా నిర్వహించుకోవచ్చు’ అని ఆయన స్పష్టం చేశారు.

కీలక అంశాలపై

మభ్యపెడ్తున్నారు

బిసిసిఐపై నిప్పులు చెరిగిన జస్టిస్ లోధా కమిటీ

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు భారీ మొత్తాలను పంపిణీ చేయడం సహా పలు కీలక అంశాలపై భారత్ క్రికకెట్ నియంత్రణ సంఘం( బిసిసిఐ) అందరినీ తప్పుదోవ పట్టిస్తోందని క్రికెట్ ప్రక్షాళన కోసం సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ ఆర్‌ఎం లోధా కమిటీ మంగళవారం స్పష్టం చేసింది. అంతేకాదు తమ ఆదేశాలకు తప్పుడు భాష్యం చెప్పడం దురదృష్టకరమని పేర్కొంది. కమిటీ తరఫున కమిటీ కార్యదర్శి గోపాల్ శంకర్ నారాయణ్ బిసిసిఐకి చెందిన పలువురు అదికారులు చేసినట్లుగా చెబుతున్న ప్రకటనలను బోర్డు అధ్యక్షసడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కే, కోశాధికారి అనిరుధ్ చౌదరి, సిఈఓ రాహుల్ జోర్హిలకు ఇ-మెయిల్ చేశారు. ఇ-మెయిల్‌లోని ఆదఏశాలు, సమాచారానికి వక్రభాష్యం చెప్పడం దురదృష్టకరం. భారత్-న్యూజిలాండ్ సిరీస్ ప్రమాదంలో పడిందని పేర్కొంటూ మీడియాలో వచ్చిన కథనాలే దీనికి నిదర్శనం’ అని ఆ ఇ-మెయిల్‌లో పేర్కొన్నారు. ‘బిసిసిఐకి చెందిన బ్యాంక్ ఖాతాలను సుప్రీంకోర్టు నియమించిన కమిటీ స్తంభింపజేయలేదు. రోజువారీ పరిపాలనా కార్యక్రమాలకు సంబంధించి కానీ, క్రికెట్ మ్యాచ్‌లు/ టోర్నమెంటులు/ కార్యకలాపాలకు సంబంధించి బ్యాంకింగ్ కార్యకలాపాలకు లేదా చెల్లింపులకు కానీ కమిటీ అభ్యంతరం తెలియజేయలేదు. బిసిసిఐ నిర్వాహకుల చర్యల కారణంగా జనం మూల్యం చెల్లించకుండా ఉండడం కోసం ఈ విషయాన్ని సంమణధిత బ్యాంకులకు వెంటనే తెలియజేయడం జరిగింది’ అని ఆ ఇ-మెయిల్‌లో పేర్కొన్నారు. అంతేకాదు కమిటీకి వాస్తవంగా అభ్యతరకరమైన అంశమేమిటో కూడా ఆ ఇ-మెయిల్‌లో స్పష్టం చేశారు. వార్షిక వౌలిక సదుపాయాల సబ్సిడీ పెంపు, చాంపియన్స్‌లీగ్ నష్టపరిహారం పంపిణీ ముసుగులో బిసిసిఐ అనుబంధ సంఘాలకు పెద్ద ఎత్తున నిధులను పంపిణీ చేయడానికి సెప్టెంబర్ 30న జరిగిన బిసిసిఐ అత్యవసర వర్కింగ్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయంపైనే కమిటీ అభ్యతరం తెలియజేసింది. ఈ మొత్తం రూ 500 కోట్లకు పైగానే ఉంటుందని మాకు అరథమవుతోంది. అలాంటి నిర్ణయాలు రొటీన్ కానీ, అత్యవసరం కానీ కాదు’ అని ఆ ఇ-మెయిల్‌లో పేర్కొంది. కాగా, గత అత్యవసర సర్వసభ్య సమావేశం వివరాలను బుధవారం సాయంత్రంకల్లా సమర్పించాలని కమిటీ బిసిసిఐని ఆదేశించింది.
ఆ సబ్సిడీలు ఉపయోగించవద్దు
కాగా,బిసిసిఐ ఇచ్చే సబ్సిడీ నిధులను ఉపయోగించవద్దని రాష్ట్రాల అసోసియేషన్‌ను లోధా కమిటీ ఆదేశించింది. వౌలిక సదుపాయాల పేరుతో బిసిసిఐ పంపిణీ చేసిన నిధులను బదిలీ చేయడం కానీ, పంపిణీ చేయడం కానీ చేయవద్దని వివిధ రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు పంపిన ఒక ఇ-మెయిల్‌లో లోధా కమిటీ స్పష్టంగా ఆదేశించింది. ఒక్కో అసోసియేషన్ ఇన్‌ఫ్రాస్టక్చర్ సబ్సిడీగా 10-20 కోట్లు, చాంపియన్స్ లీగ్ టి-20 టోర్నమెంట్ రద్దు అయినందుకు నష్టపరిహారంగా 28 కోట్లు పంపిణీ చేసినట్లు తెలిసిందని, ఈ నిధులను సెప్టెంబర్ 29నుంచి అక్టోబర్ మధ్య హడావుడిగా ఆర్‌టిజిఐ ద్వారా ఈ లావాదేవీలు జరిపినట్లు కూడా బ్యాంకులు ధ్రువీరించాయని కూడా కమిటీ ఆ ఇ-మెయిల్‌లో తెలిపింది. కొన్ని ఆదేశాలు జారీ చేయడం కోసం స్థారుూ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించిన విషయంపై ఈ నెల 6న విచారణ జరగనున్నందున ఈ నిధులను బదిలీ చేయడం చట్టవిరుద్ధమవుతుందని లోధా కమిటీ స్పష్టం చేసింది.