క్రీడాభూమి

ఎన్‌ఆర్‌ఎఐపై బింద్రా గురి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: రియో ఒలింపిక్స్‌లో భారత షూటర్ల వైఫల్యాలపై నివేదిక పూర్తయింది. ఏస్ షూటర్ అభినవ్ బింద్రా నేతృత్వంలోని కమిటీ అఖిల భారత షూటింగ్ సంఘం (ఎన్‌ఆర్‌ఎఐ)కి నివేదిక సమర్పించింది. అందులో సంఘం తీరును కమిటీ దుయ్యబట్టడం విశేషం. గత కొంతకాలంగా షూటింగ్‌లో ప్రమాణాలను పెంచడానికి ఎన్‌ఆర్‌ఎఐ ఎలాంటి చర్యలు తీసుకోలేదని కమిటీ అభిప్రాయపడింది. లండన్ ఒలింపిక్స్ తర్వాత షూటింగ్‌లో అభివృద్ధి దానంతట అదే జరుగుతుందనే ధీమాతో వ్యవహరించిందని పేర్కొంది. కొంత మంది ప్రతిభావంతులు అంతర్జాతీయ వేదికలపై రాణించడంతో, ఆ ఘనతను తన ఖాతాలో వేసుకున్న ఎన్‌ఆర్‌ఎఐ షూటర్లు నిలకడగా రాణించడానికి అవసరమైన చర్యలు తీసుకోలేదని విమర్శించింది. దేశంలో షూటింగ్ రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని బింద్రా కమిటీ తేల్చిచెప్పింది. రియో ఒలింపిక్స్‌కు 12 మంది సభ్యులతో కూడిన షూటర్ల బృందం వెళ్లినప్పటికీ ఒక్క పతకాన్ని కూడా కైవసం చేసుకోలేకపోయింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ విభాగంలో బింద్రా నాలుగో స్థానంలో నిలిచాడు. భారత షూటర్లలో అదే అత్యుత్తమ ప్రదర్శన. రియో వైఫల్యాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో, బింద్రా నేతృత్వంలో విచారణ కమిటీని ఎన్‌ఆర్‌ఎఐ నియమించింది.
ఆమోద ముద్ర
బింద్రా కమిటీ ఇచ్చిన నివేదికకు ఎన్‌ఆర్‌ఎఐ ఆమోద ముద్ర వేసింది. ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండానే దానిని ఆమోదించినట్టు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. దీనిని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ పరిశీలకు పంపనున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొంది.