క్రీడాభూమి

స్పిన్‌తో పుజారా బేజారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, అక్టోబర్ 8: భారత బ్యాట్స్‌మెన్‌కు స్పిన్‌ను అద్భుతంగా ఎదుర్కొంటారన్న పేరు ఉంది. కానీ, చటేశ్వర్ పుజారా బ్యాటింగ్ విధానం అందుకు భిన్నంగా కనిపిస్తున్నది. అతను స్పిన్నర్ల ధాటికి బెంబేలెత్తుతున్నాడు. తాజా టెస్టు ఇన్నింగ్స్‌లో అతను న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. మొత్తం మీద స్పిన్నర్లకు అతను చిక్కడం ఇది 18వ సారి. ఫాస్ట్ బౌలింగ్‌లో అతను తొమ్మిది పర్యాయాలే అవుటయ్యాడు. స్పిన్నర్ల చేతిలో అంతకంటే రెట్టింపు సార్లు పెవిలియన్ చేరుకోవడం గమనార్హం.
రహానే మైలురాయి
ఆజింక్య రహానే టెస్టుల్లో 2,000 పరుగుల మైలురాయిని దాటాడు. భారత్ తరఫున ఈ ఫీట్‌ను అందుకున్న 36వ క్రికెటర్‌గా అతను చరిత్ర పుటల్లోకి ఎక్కాడు.
మొదటి ఓవర్‌లోనే స్పిన్ అటాక్
న్యూజిలాండ్ 2002 తర్వాత మొదటిసారి ఒక టెస్టులో తొలి ఐదు ఓవర్లలోనే స్పిన్‌ను ప్రవేశపెట్టింది. భారత్‌తో శనివారం ఆరంభమైన మూడో టెస్టులో అతనిని ఐదో ఓవర్‌లోనే కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ మైదానంలోకి దింపాడు. అదే ఓవర్‌లో అతను మురళీ విజయ్ వికెట్ పడగొట్టడం విశేషం.

చిత్రం.. మరోసారి స్పిన్‌కే అవుటైన చటేశ్వర్ పుజారా