క్రీడాభూమి

కోహ్లీ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, అక్టోబర్ 8: ఫామ్ కోసం అల్లాడుతున్న భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలాకాలం తర్వాత సత్తా చాటాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆటలోనే అజేయ సెంచరీతో అభిమానులను అలరించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసింది. కోహ్లీతోపాటు ఆజింక్య రహానే 79 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ట్రెంట్ బౌల్ట్, జీతన్ పటేల్, మిచెల్ సాంట్నర్, జిమీ నీషమ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
గంభీర్ విఫలం
మురళీ విజయ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన గౌతం గంభీర్ విఫలమయ్యాడు. సుమారు రెండేళ్ల తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చిన అతను 53 బంతులు ఎదుర్కొని, 29 పరుగులు చేసి ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగాడు. అంతకు ముందే మురళీ విజయ్ తొలి వికెట్‌గా అవుటయ్యాడు. అతను 18 బంతుల్లో 10 పరుగులు చేసి, టామ్ లాథమ్ క్యాచ్ పట్టగా జీతన్ పటేల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. మొదటి వికెట్ 26 పరుగుల వద్ద కూలగా, రెండో వికెట్ 60 పరుగుల వద్ద పడింది. ఈ దశలో చటేశ్వర్ పుజారాతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను కోహ్లీ స్వీకరించాడు. జట్టు స్కోరు 100 పరుగులకు చేరుకున్నప్పుడు పుజారా వికెట్ కూలింది. అతను 108 బంతుల్లో 41 పరుగులు చేసి మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. పుజారా స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రహానే ఆచితూచి ఆడుతూ కోహ్లీకి చక్కటి మద్దతునిచ్చాడు. వీరిద్దరూ అజేయంగా 167 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. కోహ్లీ 91 బంతులు ఎదుర్కొని 103 పరుగులు చేశాడు. అతని స్కోరులో 10 ఫోర్లు ఉన్నాయి. మరో నాటౌట్ బ్యాట్స్‌మన్ రహానే 172 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 79 పరుగులు చేశాడు.

చిత్రం.. విరాట్ కోహ్లీ (103 నాటౌట్)