క్రీడాభూమి

బిస్పింగ్ ప్రతీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, అక్టోబర్ 9: ఏడేళ్ల క్రితం మొదటిసారి డాన్ హెండర్సన్‌ను లాస్ వెగాస్‌లో ఢీకొన్నప్పుడు ఎదురైన పరాజయానికి మైఖేల్ బిస్పింగ్ ప్రతీకారం తీర్చుకున్నాడు. వేలాది మంది అభిమానుల సమక్షంలో జరిగిన యుఎఫ్‌సి 204 మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ టైటిల్ పోరులో అతను హెండర్సన్‌ను చిత్తు చేశాడు. బిస్పింగ్ పంచ్‌లతో హెండర్సన్‌కు బలమైన గాయాలయ్యాయి. పరిస్థితి విషమించకుండా జాగ్రత్త పడిన రిఫరీ ఫైట్‌ను నిలిపేశాడు. న్యాయమూర్తులు బిస్పింగ్‌ను విజేతగా ప్రకటించారు. ఫైట్ ముగిసిన తర్వాత బిస్పింగ్ మాట్లాడుతూ హెండర్సన్‌ను ‘లెజెండ్’ అంటూ కీర్తించాడు. అలాంటి గొప్ప పోరాట యోధుణ్ని ఎక్కడ చూడలేదంటూ క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు.