క్రీడాభూమి

రెండో మ్యాచ్‌లోనూ కొరియా గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, అక్టోబర్ 9: ప్రపంచ కప్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో దక్షిణ కొ రియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. డిఫెండింగ్ చాంపియన్ భారత్‌పై అనూహ్య విజయం సాధించి, సంచలనం సృష్టించిన కొరియా ఆ గెలుపు ఆషామాషిగా దక్కింది కాదని అర్జెంటీనాతో ఆదివారం జరిగిన మ్యా చ్‌లో నిరూపించింది. 26 పాయంట్ల ఆధిక్యంతో గెలుపొంది, పాయంట్ల పట్టి కలో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. ఈ జట్టుకు 68 పాయంట్లు లభించగా, మొట్టమొదటిసారి ప్రపంచ కప్ కబడ్డీలో ఆడుతున్న అర్జెంటీనా 42 పాయం ట్లు సంపాదించింది. ప్రో కబడ్డీ లీగ్‌లో ఆడిన అనుభవం ఉన్న జాన్ కున్ లీ టాప్ రైడర్‌గా కొరియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. టాకిల్‌లో తయే డియోక్ ఎమ్ నంబర్‌వన్‌గా నిలిచాడు. రెండు వరుస విజయాలు వీరి ప్రతిభకు నిదర్శనం. కాగా, అర్జెంటీనాకు చెందిన ఫ్రాన్కో కాస్ట్రో 10 పాయం ట్లు సాధించడం విశేషం. నిజానికి ఆ జట్టు అందరూ ఊహించిన దానికంటే మెరుగైన ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.