క్రీడాభూమి

ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌ను ఓడిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, అక్టోబర్ 9: మలేసియాలో ఈనెల 20 నుంచి 30 వరకు జరిగే ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌ను ఓడిస్తామని భారత హాకీ జట్టు కెప్టెన్ శ్రీజేష్ ధీమా వ్యక్తం చేశాడు. సరిహద్దులో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ, త్యాగాలు చేస్తున్న సైనిక కోసం పాక్‌పై విజయం సాధిస్తామని ఇక్కడ జరుగుతున్న శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న శ్రీజేష్ అన్నాడు. ఇటీవల ఉరీలో భారత సైనిక స్థావరంపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడి గురించి, అందులో 18 మంది సైనికులు మృతి చెందడం గురించి శ్రీజేష్ నేరుగా ప్రస్తావించలేదు. అయితే, సరిహద్దులో పహరా కాస్తున్న సైనికులను గౌరవించేందుకు పాక్‌పై గెలుస్తామని అన్నాడు. అక్టోబర్ 23న జరిగే ఆ మ్యాచ్‌లో ఓటమిపాలైతే సైనికులు నిరాశ చెందుతారని అన్నాడు. మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్, చింగ్లెన్సనా సింగ్ వంటి హేమాహేమీలతో కూడిన 26 మంది ప్రాబబుల్స్‌కు ఇక్కడ శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఆసియా చాంపియన్స్ ట్రోఫీకి ఈ ప్రాబబుల్స్ నుంచే జట్టును ఎంపిక చేస్తారు. పాక్, భారత్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న తరుణంలో, మలేసియా వేదికగా ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచ్ ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రతి ఒక్కరూ ఈ మ్యాచ్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్న సంగతి తమకు తెలుసునని శ్రీజేష్ అన్నాడు. పాక్‌తో పోలిస్తే భారత్ పటిష్టమైన స్థితిలో ఉందని చెప్పాడు. అయితే, ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయబోమని స్పష్టం చేశాడు. తనదైన రోజున ఎలాంటి జట్టునైనా ఓడించే సామర్థ్యం పాకిస్తాన్‌కు ఉందని అన్నాడు. ఈ టోర్నీలో కొరియా, మలేసియా జట్ల మధ్య గట్టిపోటీ ఉంటుందని అభిప్రాయపడ్డాడు.