క్రీడాభూమి

రష్యా ఓపెన్ విజేత రుత్విక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్లాడివొస్టక్ (రష్యా), అక్టోబర్ 9: రష్యా ఓపెన్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో భారత క్రీడాకారిణి రుత్విక శివానీ గద్దె టైటిల్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో టైటిల్ కోసం యెవ్‌గెనియా కొసెస్కయాతో తలపడిన ఆమె 21-10, 21-13 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ కేవలం 26 నిమిషాల్లో ముగియడం విశేషం. అయితే, పురుషుల సింగిల్స్‌లో భారత్ రన్నరప్ ట్రోఫీతోనే సంతృప్తి చెందాల్సి వచ్చింది. ఫైనల్‌లో జుల్ఫాడ్లి జుల్క్ఫ్లిని ఢీకొన్న సిరిల్ వర్మ 21-16, 19-21, 10-21 తేడాతో ఓటమిపాలయ్యాడు. కాగా, మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో సిక్కీ రెడ్డి, ప్రణవ్ జెర్రీ చోపా టైటిల్ సాధించారు. వ్లాదిమిర్ ఇవానొవ్, వలేరియా సొరొకినా జోడీతో తలపడిన వీరు 21-17, 21-19 ఆధిక్యంతో, వరుస సెట్లలో గెలిచి టైటిల్ అందుకున్నారు.