క్రీడాభూమి

కోహ్లీ ‘డబుల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, అక్టోబర్ 9: న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి, మూడో టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో అతను ఈ ఫీట్‌ను ప్రదర్శించడం ఇది రెండోసారి. కెప్టెన్ హోదాలో రెండుసార్లు డబుల్ సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్‌గా అతను రికార్డు నెలకొల్పాడు. ఆజింక్య రహానే కేవలం 12 పరుగుల తేడాతో డబుల్ సెంచరీని చేజార్చుకొని, శతకానికే పరిమితమయ్యాడు. వీరిద్దరి విజృంభణతో బలోపేతమైన భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 5 వికెట్లకు 557 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టం లేకుండా 28 పరుగులు చేసింది. టీమిండియా కంటే ఆ జట్టు ఇంకా 529 పరుగులు వెనుకంజలో ఉంది.
మూడు వికెట్లకు 267 పరుగుల స్కోరువద్ద మ్యాచ్ రెండో రోజు, ఆదివారం ఉదయం ఆటను మొదలుపెట్టిన టీమిండియా 465 పరుగుల స్కోరువద్ద నాలుగో వికెట్‌ను కోహ్లీ రూపంలో కోల్పోయింది. అతను 366 బంతులు ఎదుర్కొని, 20 ఫోర్ల సాయంతో 211 పరుగులు చేసి, జీతన్ పటేల్ బౌలింగ్‌లో వికెట్లకు అడ్డంగా దొరికిపోవడంతో ఎల్‌బిగా వెనుదిరిగాడు. అనంతరం రోహిత్ శర్మతో కలిసి జట్టును స్కోరును 500 పరుగుల మైలురాయిని దాటించిన రహానే 188 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ బ్రాడ్లే వాల్టింగ్ క్యాచ్ అందుకోగా పెవిలియన్ చేరాడు. మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన అతను 381 బంతులు ఎదుర్కొన్నాడు. 18 ఫోర్లు, నాలుగు సిక్సర్లు కొట్టాడు. ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయకుండా రహానే డబుల్ సెంచరీ కోసం వేచిచూసిన కోహ్లీ, అప్పటికే అర్ధ శతకానికి దగ్గరగా ఉన్న రోహిత్ శర్మ కోసం మరికొంత సేపు నిరీక్షించాడు. రోహిత్ 63 బంతుల్లో 51 పరుగులు చేసిన వెంటనే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించాడు. అప్పటికి రోహిత్‌తోపాటు రవీంద్ర జడేజా (27 బంతుల్లో 17) క్రీజ్‌లో ఉన్నాడు. భారత్ మొదటి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన తర్వాత, మొదటి ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన కివీస్ ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్, టామ్ లాథమ్ జాగ్రత్తగా ఆడుతూ వికెట్ పడకుండా రెండో రోజు ఆటను ముగించారు. వికెట్ నష్టం లేకుండా కివీస్ 28 పరుగులు చేయగా, గుప్టిల్ 17, లాథమ్ 6 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.
జడేజాకు జరిమానా: పిచ్‌ని ధ్వంసం చేసే విధంగా పరిగెత్తిన భారత ఆటగాడు రవీంద్ర జ డేజాకు మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు.

స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 3 వికెట్లకు 267): మురళీ విజయ్ సి టామ్ లాథమ్ బి జీతన్ పటేల్ 10, గౌతం గంభీర్ ఎల్‌బి ట్రెంట్ బౌల్ట్ 29, చటేశ్వర్ పుజారా బి మిచెల్ సాంట్నర్ 41, విరాట్ కోహ్లీ ఎల్‌బి జీతన్ పటేల్ 211, ఆజింక్య రహానే సి బ్రాడ్లే వాల్టింగ్ బి ట్రెంట్ బౌల్ట్ 188, రోహిత్ శర్మ 51 నాటౌట్, రవీంద్ర జడేజా 17 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 10, మొత్తం (169 ఓవర్లలో 5 వికెట్లకు) 557 డిక్లేర్.
వికెట్ల పతనం: 1-26, 2-60, 3-100, 4-465, 5-504.
బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ 32-2-113-2, మాట్ హెన్రీ 36-3-127-0, జీతన్ పటేల్ 40-5-120-2, మిచెల్ సాంట్నర్ 44-4-137-1, జీమీ నీషమ్ 18-1-53-0.
న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్: మార్టిన్ గుప్టిల్ 17 నాటౌట్, టామ్ లాథమ్ 6 నాటౌట్, మొత్తం (తొమ్మిది ఓవర్లలో వికెట్ నష్టం లేకుండా) 28.
బౌలింగ్: మహమ్మద్ షమీ 2-0-5-0, ఉమేష్ యాదవ్ 2-0-7-0, అశ్విన్ 3-1-9-0, రవీంద్ర జడేజా 2-1-2-0.

* కోహ్లీ, రహానే నాలుగో వికెట్‌కు 365 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశారు. భారత్ తరఫున అత్యధిక పార్ట్‌నర్‌షిప్స్‌లో ఇది ఐదోది. న్యూజిలాండ్‌పై వినూ మన్కడ్, పంకజ్ రాయ్ మొదటి వికెట్‌కు 413, పాకిస్తాన్‌పై రాహుల్ ద్రవిడ్, వీరేందర్ సెహవాగ్ మొదటి వికెట్‌కు 410, ఆస్ట్రేలియాపై ఐదో వికెట్‌కు రాహుల్ ద్రవిడ్, వివిఎస్ లక్ష్మణ్ 376, అదే జట్టుపై రెండో వికెట్‌కు చటేశ్వర్ పుజారా, మురళీ విజయ్ 370 చొప్పున భాగస్వామ్యాలను నమోదు చేశారు.
* టెస్టుల్లో నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన ఇద్దరు భారత బ్యాట్స్‌మెన్ 150 లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తిగత స్కోర్లను నమోదు చేయడం ఇది రెండోసారి. ఆస్ట్రేలియాతో 2004లో సిడ్నీ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో సచిన్ తెండూల్కర్ 241 నాటౌట్, వివిఎస్ లక్ష్మణ్ 178 చొప్పున పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 211, రహానే 188 పరుగులు సాధించారు.
* న్యూజిలాండ్‌పై భారత్ మూడో అత్యధిక స్కోరును నమోదు చేసింది. 1999లో అహ్మదాబాద్ టెస్టులో ఏడు వికెట్లకు 583 పరుగులు సాధించింది. 2010లో నాగపూర్ టెస్టులో 8 వికెట్ల నష్టానికి 566 పరుగులు చేసింది. ఈ టెస్టులో 5 వికెట్లకు 557 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.

* రహానే 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన గత తొమ్మిది ఇన్నింగ్స్‌లో ఆరు పర్యాయాలు వాటిని సెంచరీలుగా ముగించాడు. అంతకు ముందు అతను ఎనిమిది ఇన్నింగ్స్‌లో యాభై కంటే ఎక్కువ పరుగులు చేసినా, కేవలం రెండు సార్లే సెంచరీ పూర్తి చేయగలిగాడు.
* టెస్టుల్లో ఐదవ లేదా అంతకంటే కింది స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగి ఎక్కువ పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్ జాబితాలో రహానేకు ఐదో స్థానం దక్కింది. 2013 ఫిబ్రవరి 22న చెన్నైలో ఆస్ట్రేలియాపై మహేంద్ర సింగ్ ధోనీ 224 పరుగులు చేశాడు. 2008 అక్టోబర్ 29న ఢిల్లీలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో వివిఎస్ లక్ష్మణ్ అజేయంగా 200 పరుగులు సాధించాడు. మహమ్మద్ అజరుద్దీన్ 1986 డిసెంబర్ 17న కాన్పూర్‌లో శ్రీలంకపై 199, 1990 ఫిబ్రవరి 22న ఆక్లాండ్‌లో న్యూజిలాండ్‌పై 192 చొప్పున పరుగులు చేశాడు.
* న్యూజిలాండ్‌ను కోహ్లీ ఎంతగా భయపెట్టాడో చెప్పడానికి ఆ జట్టు కోచ్ మైక్ హెస్సన్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. కోహ్లీ ఎంతో మృదువుగా తమను హత్య చేసేశాడని రెండో రోజు ఆనంతరం అతను విలేఖరులతో మాట్లాడుతూ వాపోయాడు.

జట్టుకు నాయకత్వం వహిస్తూ, ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లలో కోహ్లీ రెండోవాడు. మొదటి స్థానాన్ని సచిన్ తెండూల్కర్ ఆక్రమించాడు. అతను 1999 అక్టోబర్ 29న 217 పరుగులు సాధించాడు. కోహ్లీ ఈ ఇన్నింగ్స్‌లో 211 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలాన్ బోర్డర్ మూడో స్థానంలో ఉన్నాడు. 1987 డిసెంబర్ 11న అతను అడెలైడ్‌లో 205 పరుగులు చేశాడు.
కోహ్లీ స్వదేశంలో 17 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ నమోదు చేయలేకపోయాడు. తన 18వ ఇన్నింగ్స్‌లో అతను ఏకంగా డబుల్ సెంచరీ సాధించాడు. ఇంతకు ముందు అతను 2013లో ఆస్ట్రేలియాపై చెన్నైలో శతకాన్ని పూర్తి చేశాడు.
ఒకే క్యాలండర్ ఇయర్‌లో రెండు పర్యాయాలు 150 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన భారత కెప్టెన్లలో కోహ్లీ నాలుగోవాడు. ఇంతకు ముందు విజయ్ హజారే (1951లో), సునీల్ గవాస్కర్ (1978లో), మహమ్మద్ అజరుద్దీన్ (1990లో) ఈ ఫీట్ ప్రదర్శించారు.

రెండు పర్యాయాలు టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన మొదటి భారత కెప్టెన్ కోహ్లీ. అతను ఇదే ఏడాది జూలైలో వెస్టిండీస్‌పై ఆంటిగ్వాలో జరిగిన టెస్టులో డబుల్ సెంచరీ చేశాడు.