క్రీడాభూమి

ఇటలీని గెలిపించిన ఇమోబైల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, అక్టోబర్ 10: వరల్డ్ కప్ సాకర్ క్వాలిఫయర్స్‌లో భాగంగా మెసడోనియాపై ఇటలీ 3-2 గోల్స్ తేడాతో విజయం సాధించింది. సిరో ఇమోబైల్ కీలక గోల్ చేసి, ఆ జట్టును గెలిపించాడు. మ్యాచ్ 24వ నిమిషంలో ఆండ్రియా బెలోటీ చేసిన గోల్‌తో ఇటలీ గోల్స్ ఖాతాను తెరవగా, 57వ నిమిషంలోలిజా నెస్టొరొవ్‌స్కీ మెసడోనియాకు ఈక్వెలైజర్‌ను అందించాడు. మరో రెండు నిమిషాల్లోనే ఫెరాన్ హసానీ గోల్ చేయడంతో మెసడోనియా ఆధిక్యం 2-1కు చేరింది. ప్రత్యర్థి రెండు వరుస గోల్స్ చేయడంతో కంగుతిన్న ఇటలీ ఎదరుదాడికి దిగినప్పటికీ, మెసడోనియా రక్షణ వలయాన్ని ఛేదించడానికి 20 నిమిషాలు శ్రమించాల్సి వచ్చింది. 79వ నిమిషంలో ఇమోబైల్ చేసిన గోల్‌తో స్కోరు సమమైంది. మ్యాచ్ నిర్ణీత సమయం ముగిసే వరకూ అదే స్కోరు కొనసాగింది. ఎక్‌స్ట్రా టైమ్ మొదటి నిమిషంలోనే ఇమోబైల్ గోల్ సాధించి, ఇటలీ ఆధిక్యాన్ని 3-2కు పెంచాడు. మిగతా సమయాన్ని ఇటలీ డ్రిబ్లింగ్‌లోనే గడిపి, అదే తేడాతో గెలిచింది.
మరో మ్యాచ్‌లో ఫిన్లాండ్‌పై క్రొయేషియా 1-0 తేడాతో విజయం సాధించింది. యూరోపియన్ సాకర్‌లో జువెంటాస్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న మారియో మజూకీ కీలక గోల్ చేసి క్రొయేషియాను గెలిపించాడు.