క్రీడాభూమి

గంభీర్‌కు భుజం నొప్పి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్: సుమారు రెండేళ్ల తర్వాత మళ్లీ భారత జట్టు ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు దక్కించుకున్న ఓపెనర్ గౌతం గంభీర్‌ను దురదృష్టం వెంటాడుతున్నది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి, మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అతను 53 బంతులు ఎదుర్కొని, 23 పరుగులు చేసి ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో అదే బౌలర్ వేసిన ఓవర్‌లో గాయం తిరగబెట్టడంతో మైదానం విడిచి వెళ్లాడు. ఒక పరుగు పూర్తి చేసి, రెండో పరుగు కోసం ప్రయత్నించిన గంభీర్ రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి డైవ్ చేయాల్సి వచ్చింది. సకాలంలో క్రీజ్‌లోకి చేరుకోగలిగినా, డైవ్ చేయడంతో చాలాకాలంగా వేధిస్తున్న అతని భుజం గాయం తిరిగి ప్రత్యక్షమైంది. ఫిజియోథెరపిస్టు పాట్రిక్ ఫర్హార్ట్ హడావుడిగా మైదానంలోకి వచ్చి, గంభీర్‌కు ప్రాథమిక చికిత్స చేశాడు. అయితే, చేతిని పూర్తిగా ముందుకు చాచడంలో విఫలం కావడంతో అతనికి విశ్రాంతి అవసరమని ఫర్హార్ట్ సూచించాడు. దీనితో ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద రిటైర్డ్ హర్ట్‌గా గంభీర్ వెనుదిరిగాడు. కాగా, అతని గాయం తీవ్రతపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఒకవేళ అతను పూర్తిగా కోలుకోలేకపోతే, మళ్లీ భారత జట్టులోకి రావడం అసాధ్యమనే చెప్పాలి.
* న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జిమీ నీషమ్ 2014 ఫిబ్రవరి 14 నుంచి 18వ తేదీ వరకు వెల్లింగ్టన్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌తో టెస్టు కెరీర్‌ను ఆరంభించాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 33 పరుగులు చేసిన అతను రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 137 పరుగులు సాధించాడు. తాజా మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో జట్టును ఆదుకునేందుకు చివరి వరకూ పోరాడిన అతను 71 పరుగులు చేశాడు.
* న్యూజిలాండ్ సోమవారం నాటి ఆట మొదటి సెషన్‌లో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది. అయితే, రెండో సెషన్‌లో ఏకంగా ఐదు వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో కూరుకుపోయింది. లోయర్ మిడిల్ ఆర్డర్‌లో జీషమ్, బ్రాడ్లే వాల్టింగ్, మిచెల్ సాంట్నర్ కొంత సేపు భారత బౌలింగ్‌ను ప్రతిఘటించి ఉండకపోతే, ఆ జట్టు 250 పరుగుల మైలురాయిని కూడా దాటి ఉండేదికాదు.
* ఒక విదేశీ జట్టు మన దేశంలో మొదటి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేయడం 2013 తర్వాత ఇదే తొలిసారి. ఆ ఏడాది మార్చి 14 నుంచి 18 వరకూ మొహాలీలో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్లు ఎడ్ కోవర్, డేవిడ్ వార్నర్ సెంచరీ పార్ట్‌నర్‌షిప్ నమోదు చేశారు. ఆతర్వాత 18 విదేశీ జట్లు మన దేశంలో 18 ఇన్నింగ్స్ ఆడినా, ఒక్కసారి కూడా ఈ ఫీట్ పునరావృతం కాలేదు. 19వ ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్, టామ్ లాథమ్ మొదటి వికెట్‌కు 118 పరుగులు జోడించారు.