క్రీడాభూమి

ఢాకాలో బెట్టింగ్ ఆరోపణలపై భారతీయుడి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, అక్టోబర్ 10: ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న వనే్డ సిరీస్ మ్యాచ్‌లపై బెట్టింగ్‌కు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై ఒక భారతీయుడిని ఢాకా పోలీసు అధికారులు అరెస్టు చేశారు. అతనిని భారత రాయబార కార్యాలయానికి తీసుకెళ్లి ప్రశ్నిస్తున్నట్టు తెలిపారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బిసిబి) అధికార ప్రతినిధి జలాల్ యూనుస్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. బెట్టింగ్‌ను నిర్వహిస్తున్నట్టు సమాచారం అందడంతో ఢాకా పోలీసులు ఒక భారతీయుడిని నిర్బంధంలోకి తీసుకున్నారని అతను ఒక ప్రకటనలో తెలిపాడు. అయతే, ఆ వ్యక్తి వివరాలను పోలీసులు వెల్లడించలేదని అన్నాడు. బంగ్లాదేశ్‌లో బెట్టింగ్ నిషిద్ధమని, దోషులకు శిక్షలు కఠినంగా ఉంటాయని పేర్కొన్నాడు. బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ వంటి అవినీతి చర్యలను బిసిబి వ్యతిరేకిస్తుందని చెప్పాడు. 2012 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బిపిఎల్)లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు తెరపైకి రావడంతో బిసిబి ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నది. అప్పట్లో స్పిన్నర్ షైఫుల్ ఉల్ హక్‌పై ఆరోపణలు రుజువుకావడంతో, అతనిపై జీవితకాల సస్పెన్షన్‌ను విధించింది. అంపైర్ నదీర్ షాను పదేళ్లపాటు క్రికెట్ నుంచి నిషేధించింది.
బట్లర్‌కు హెచ్చరిక
ఇంగ్లాండ్ వనే్డ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న జోస్ బట్లర్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) అధికారికంగా హెచ్చరించింది. బంగ్లాదేశ్ కెప్టెన్ మష్రాఫ్ మోర్తాజా, బ్యాట్స్‌మన్ సబ్బీర్ రహ్మాన్‌లకు మ్యాచ్ ఫీజులో 20 శాతాన్ని జరిమానాగా విధించింది. ఈ రెండు జట్ల మధ్య ఢాకాలో జరిగిన రెండో వనే్డలో ఈ ముగ్గురూ ఘర్షణ పడ్డారు. టీవీ ఫుటేజీలను పరిశీలించిన తర్వాత ఐసిసి తన నిర్ణయాన్ని ప్రకటించింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్ మొదటి వనే్డను గెల్చుకుంది. రెండో వనే్డలో 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 238 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ 44.4 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. ఇయాన్ మోర్గాన్ ఈ టూర్‌కు రాని కారణంగా ఇంగ్లాండ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న జొస్ బట్లర్ అర్ధ శతకాన్ని సాధించి, జట్టును ఆదుకునే ఊపుమీద కనిపించాడు. అతను 57 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తస్కిన్ అహ్మద్ వేసిన బంతి ప్యాడ్స్‌కు తగిలింది. బట్లర్ ఎల్‌బి అయ్యాడంటూ తస్కిన్ చేసిన అప్పీల్‌ను ఫీల్డ్ అంపైర్ తిరస్కరించడంతో మోర్తాజా థర్డ్ ఎంపైర్ జోక్యాన్ని కోరాడు. రీ ప్లేలో బట్లర్ అవుటైనట్టు నిర్ధారించిన థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే మోర్తాజా, సబ్బీర్ తదితరులు గంతులు వేస్తూ, బట్లర్‌ను హేళన చేశారు. దీనితో ఆగ్రహంచిన బట్లర్ వారితో వాగ్వాదానికి దిగాడు. మ్యాచ్ పూర్తయిన తర్వాత కూడా ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంపై ఐసిసి మ్యాచ్ రిఫరీకి ఫీల్డ్ అంపైర్లు ఫిర్యాదు చేశారు. ఫుటేజీలను తెప్పించుకొని పరిశీలించిన ఐసిసి బట్లర్‌ను హెచ్చరించి వదిలేసింది. మోర్తాజా, సబ్బీర్‌లకు జరిమానా విధించింది. ఇలావుంటే, ఈ వనే్డలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు మోర్తాజాకు దక్కడం విశేషం.

చిత్రం... బంగ్లాదేశ్ ఆటగాళ్లతో బట్లర్ వాగ్వాదం