క్రీడాభూమి

కారుతో కష్టాలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: రియో ఒలింపిక్స్ మహిళల జిమ్నాస్టిక్స్‌లో తృటిలో కాంస్య పతకాన్ని కోల్పోయిన దీపా కర్మాకర్‌కు భారీగానే బహుమతులు లభించాయి. వాటిలో హైదరాబాద్ జిల్లా బాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ బహూకరించిన అత్యంత ఖరీదైన బిఎండబ్ల్యు కారు కూడా ఉంది. రియోలో పతకాలు సాధించిన షట్లర్ పివి సింధు, రెజ్లర్ సాక్షి మాలిక్‌తోపాటు దీప చూపిన పోరాటానికి గుర్తుగా ఆమెకు కూడా చాముండేశ్వరీనాథ్ విలాసవంతమైన కారును బహూకరించాడు. అయితే, దాని మెయింటెనెన్స్ దీపకు సాధ్యం కావడం లేదని సమాచారం. పెద్దకారుతో దీప ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తించిన చాముండేశ్వరీనాథ్ ఆమెతో మాట్లాడతానని అన్నాడు. ఆమెకు ఏది అనుకూలంగా ఉంటుందో అలాంటి కారునే ఇవ్వడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఒక ప్రకటనలో తెలిపాడు. దీపకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూస్తానని హామీ ఇచ్చాడు. ఆగస్టు 28న హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడెమీలో ఈ ముగ్గురు రియో స్టార్లకు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ బిఎండబ్ల్యు కారు తాళాలను అందచేశాడు.