క్రీడాభూమి

ఇంగ్లాండ్, స్లొవేకియా మ్యాచ్ డ్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, అక్టోబర్ 12: ప్రపంచ కప్ సాకర్ క్వాలిఫయర్స్‌లో కష్టాలకు ఎదురీదుతున్న ఇంగ్లాండ్ కీలక విజయాన్ని సాధించడంలో మరోసారి విఫలమైంది. స్లొవేకియాతో జరిగిన మ్యాచ్‌ని గెల్చుకునే పరిస్థితి ఉన్నప్పటికీ, అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయింది. స్లొవేకియా రక్షణాత్మక విధానాన్ని అనుసరించగా, ఎదురుదాడికి దిగాల్సిన ఇంగ్లాండ్ తన స్థాయికి తగినట్టు రాణించలేకపోయింది. ఫామ్‌లో లేని కెప్టెన్ వేన్ రూనీని బెంచ్‌కి పరిమితం చేసినప్పటికీ, మిగతా ఆటగాళ్లు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేకపోయారు. స్లొవేకియా డిఫెన్స్‌ను ఛేదించడంలో విఫలమైన ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌ని డ్రాగా ముగించింది. ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి.
చైనాకు చుక్కెదురు
చైనా 2018 ప్రపంచ కప్ ఆశలకు గండిపడింది. తాష్కెంట్‌లో ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ని 0-2 తేడాతో చేజార్చుకొని, వరల్డ్ కప్‌లో ఆడే అవకాశాన్ని దాదాపుగా కోల్పోయింది. ఉజ్బెకిస్తాన్ ఆటగాళ్లు మరాట్ బిక్మయెవ్, ఒటాబెక్ షుకరోవ్ చెరొక గోల్ చేసి, తమ జట్టును గెలిపించారు. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ప్రపంచ కప్‌లో ఆడే అవకాశం దక్కని ఉజ్బెకిస్తాన్ మెగా టోర్నీలో పాల్గొనడమే లక్ష్యంగా పెట్టుకుంది.

జర్మనీ దూకుడు
పారిస్: డిఫెండింగ్ వరల్డ్ చాంపియన్ జర్మనీ క్వాలిఫయర్స్‌లో దూకుడును కొనసాగిస్తున్నది. నార్త్ ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ని ఆ జట్టు 2-0 తేడాతో గెల్చుకుంది. మ్యాచ్ మొదలైన క్షణం నుంచే దాడికి దిగిన జర్మనీకి 13వ నిమిషంలో జూలియన్ డ్రాక్స్‌లెర్ తొలి గోల్‌ను అందించాడు. మరో నాలుగు నిమిషాల్లోనే సమీ ఖెదిరా మరో గోల్‌ను జత కలిపాడు. 2-0 ఆధిక్యాన్ని సంపాదించిన తర్వాత జర్మనీ వ్యూహాత్మకంగా డిఫెన్సివ్ విధానాన్ని అమలు చేసింది. నార్త్ ఐర్లాండ్‌కు గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా, మ్యాచ్‌ని తన ఖాతాలో వేసుకుంది.