క్రీడాభూమి

ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్ టాప్ బౌలర్ అశ్విన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, అక్టోబర్ 12: ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్ బౌలింగ్ విభాగంలో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని సంపాదించాడు. న్యూజిలాండ్‌తో ఇండోర్‌లో జరిగిన చివరి, మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 59 పరుగులకే ఏడు వికెట్లు పడగొట్టిన అతను మొత్తం 900 పాయింట్లతో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాడు. 2015 సంవత్సరాన్ని అతను ఇదే ర్యాంక్‌తో ముగించాడు. ఈఏడాది ఆరంభంలో డేల్ స్టెయిన్ నంబర్ వన్ స్థానంలోకి రాగా, జూలై మాసంలో కొద్దికాలం అశ్విన్ నంబర్ వన్‌గా ఎదిగాడు. తిరిగి దానిని స్టెయిన్‌కే అప్పగించాడు. సుమారు మూడు నెలల అనంతరం అతనికి తిరిగి నంబర్ వన్ స్థానం దక్కింది. స్టెయిన్ 878 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ 870 పాయింట్లు సంపాదించి మూడో స్థానాన్ని సంపాదించుకున్నాడు. భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా 805 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నాడు.
ఆల్‌రౌండర్‌గానూ..
బౌలింగ్‌తోపాటు ఆల్‌రౌండర్ విభాగంలోనూ అశ్విన్ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. అతను 451 పాయింట్లతో ఈ స్థానంలో నిలవగా, బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ 384 పాయింట్లతో ద్వితీయ స్థానంలో నిలిచాడు. రవీంద్ర జడేజా, మోయిన్ అలీ చెరి 292 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతున్నారు.
‘టాప్-10’లో రహానే
కివీస్‌తో జరిగిన సిరీస్‌లో చక్కటి ప్రతిభ కనబరచి, 347 పరుగులు చేసిన భారత యువ ఆటగాడు ఆజింక్య రహానేకు టెస్టు క్రికెట్ బ్యాటింగ్ ‘టాప్-10’లో స్థానం లభించింది. స్టీవెన్ స్మిత్ (ఆస్ట్రేలియా/ 906 పాయింట్లు), జో రూట్ (ఇంగ్లాండ్/ 878 పాయింట్లు, షహీం ఆమ్లా (దక్షిణాఫ్రికా/ 847 పాయింట్లు) మొదటి మూడు స్థానాలను ఆక్రమించగా, 841 పాయింట్లతో రహానే ఆరో స్థానంలో ఉన్నాడు.

మూడో టెస్టు సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్: 169 ఓవర్లలో 5 వికెట్లకు 557 డిక్లేర్డ్ (చటేశ్వర్ పుజారా 41, విరాట్ కోహ్లీ 211, ఆజింక్య రహానే 188, రోహిత్ శర్మ 51 నాటౌట్, ట్రెంట్ బౌల్ట్ 2/113, జీతన్ పటేల్ 2/120).
న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్: 90.2 ఓవర్లలో 299 ఆలౌట్ (మార్టిన్ గుప్టిల్ 72, టామ్ లాథమ్ 53, జిమీ నీషమ్ 71, అశ్విన్ 6/81, రవీంద్ర జడేజా 2/80).
భారత్ రెండో ఇన్నింగ్స్: 49 ఓవర్లలో 3 వికెట్లకు 216 డిక్లేర్డ్ (చటేశ్వర్ పుజారా 101 నాటౌట్, గౌతం గంభీర్ 50, ఆజింక్య రహానే 23 నాటౌట్, జీతన్ పటేల్ 2/56).
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ (విజయ లక్ష్యం 475): 44.5 ఓవర్లలో 153 ఆలౌట్ (రాస్ టేలర్ 32, మార్టిన్ గుప్టిల్ 29, కేన్ విలియమ్‌సన్ 23, అశ్విన్ 7/59, జడేజా 2/45).

మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్‌ను 3-0 తేడాతో చిత్తు చేసిన భారత క్రికెట్ జట్టు. ఇండోర్‌లో జరిగిన చివరి, మూడో టెస్టును 321 పరుగుల భారీ తేడాతో గెల్చుకున్న టీమిండియా ప్రపంచ టీమ్ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్‌ను రెండో స్థానంలోకి నెట్టి మళ్లీ నంబర్ వన్‌గా అవతరించింది.