క్రీడాభూమి

భారత కెప్టెన్ కోహ్లీ చేతికి టెస్టు మేస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, అక్టోబర్ 12: భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచ నంబర్ వన్ హోదాకు సూచనగా ఇచ్చే ‘మేస్’ (గద) అందింది. మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ దీనిని కోహ్లీకి అందచేశాడు. న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో రెండో మ్యాచ్‌ని గెలిచిన వెంటనే టీమిండియాకు ప్రపంచ నంబర్ వన్ హోదా ఖాయమైంది. చివరిదైన మూడో టెస్టు ముగిసిన తర్వాద ఐసిసి అధికారికంగా భారత్‌ను నంబర్ వన్ జట్టుగా ప్రకటించింది. ఈ స్థానానికి గుర్తుగా ఇచ్చే మేస్‌ను కోహ్లీ సగర్వంగా స్వీకరించాడు. కాన్పూర్‌లో జరిగిన మొదటి టెస్టును 197 పరుగులతో గెల్చుకున్న కోహ్లీ బృందం కోల్‌కతాలో జరిగిన రెండో టెస్టులో 178 పరుగులతో నెగ్గింది. ఇండోర్ వేదికగా జరిగిన చివరిదైన మూడో టెస్టును ఏకంగా 321 పరుగుల భారీ తేడాతో సొంతం చేసుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లకు 557 పరుగుల భారీ స్కోరువద్ద డిక్లేర్ చేసిన భారత్ ఆతర్వాత న్యూజిలాండ్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 299 పరుగులకే ఆలౌట్ చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 258 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన భారత్ రెండో ఇన్నింగ్స్‌ను మూడు వికెట్లకు 216 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. చటేశ్వర్ పుజారా 101 పరుగులతో నాటౌట్‌గా నిలవడం విశేషం. గౌతం గంభీర్ 50 పరుగులు చేయగా, ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసే సమయానికి పుజారాతోపాటు ఆజింక్య రహానే (23) నాటౌట్‌గా ఉన్నాడు. పుజారా సెంచరీ పూర్తయిన వెంటనే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడం ద్వారా కివీస్ ముందు భారత్ 475 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. దీనిని ఛేదించేందుకు రెండో ఇన్నింగ్స్ ఆడిన న్యూజిలండ్ 44.5 ఓవర్లలో 153 పరుగులకే కుప్పకూలింది. రాస్ టేలర్ 32 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, మార్టిన్ గుప్టిల్ (29), కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ (32) కొంత సేపు భారత బౌలింగ్‌ను ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. అశ్విన్ 59 పరుగులిచ్చి ఏడు వికెట్లు కూల్చగా, రవీంద్ర జడేజా 45 పరుగులకు రెండు వికెట్లు సాధించాడు.

సుమారు మూడు నెలల అనంతరం ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్ బౌలింగ్ విభాగంలో మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించిన భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ఆల్ రౌండర్ల విభాగంలోనూ అతను టాపర్‌గా నిలిచాడు. చివరి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు, రెండో ఇన్నింగ్స్‌లో ఏడు చొప్పున వికెట్లు పడగొట్టిన అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అదే విధంగా మూడు టెస్టుల్లో కలిపి 27 వికెటుల సాధించిన అతను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా దక్కించుకున్నాడు.

వనే్డ సిరీస్ ఇంగ్లాండ్‌కే..
చిట్టగాంగ్, అక్టోబర్ 12: బంగ్లాదేశ్‌తో జరిగిన వనే్డ క్రికె ట్ సిరీస్‌ను ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది. చివరిదైన మూ డో మ్యాచ్‌లో ఆ జట్టు మరో 13 బంతులు మిగిలి ఉండగా నే నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సిరీస్‌లో 2-1 ఆధిక్యాన్ని సంపాదించి సత్తా చాటింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 278 పరుగులు సాధించింది. తమీమ్ ఇక్బాల్ (45), ఇమ్రుల్ ఖయాస్ (46), ముష్ఫికర్ రహీం (67 నాటౌ ట్) రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 47.5 ఓవర్లలో ఆరు వికెట్లు చేజార్చుకొని 278 పరుగులు సాధించింది. శామ్ బిల్లింగ్స్ 52, బెన్ డకెట్ 63 చొప్పున పరుగులు సాధించి ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. చివరిలో బెన్ స్టోక్స్ (47 నాటౌట్), జొస్ బ ట్లర్ (25), బెన్ వోక్స్ (27 నాటౌట్) వీరోచిత పోరాటం ఇం గ్లాండ్‌ను గెలిపించింది. రెండో వనే్డ సందర్భంగా బట్లర్‌తో బంగ్లాదేశ్ క్రీడాకారులు తీవ్రంగా ఘర్షణ పడడంతో ఈ మ్యాచ్ ఆసక్తి రేపింది. అయతే, ఎలాంటి గొడవలు లేకుం డా మ్యాచ్ ప్రశాంతంగా ముగిసింది.

చైనీస్ తైపీ బాడ్మింటన్ టోర్నీ
ప్రీ క్వార్టర్స్‌కు సౌరవ్
చైనీస్ తైపీ, అక్టోబర్ 12: భారత ఆటగాడు సౌరభ్ వర్మ ఇక్కడ జరుగుతున్న చైనీస్ తైపీ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో ప్రీ క్వార్టర్స్ చేరాడు. రెండో రౌండ్‌లో అతను జపాన్‌కు చెందిన హషిరో షిమోనోను 11-6, 8-11, 12-10, 11-3 తేడాతో ఓడించాడు. అంతకు ముదు జరిగిన మొదటి రౌండ్‌లో అతను స్థానిక ఆటగాడు ఇ సియాంగ్ యాంగ్‌పై 12-10, 11-3, 11-5 ఆధిక్యంతో విజయం సాధించాడు. కాగా, సౌరవ్ తమ్ముడు సమీర్ వర్మ రెండో రౌండ్‌లో పరాజయాన్ని ఎదుర్కొని, టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మొవదటి రౌండ్‌లో బై లభించిన అతనిని రెండో రౌండ్‌లో చియా హంగ్ లూ (చైనీస్ తైపీ) 12-10, 6-11, 11-3, 11-4 పాయింట్ల తేడాతో ఓడించాడు. శ్రేయాంత్ జైసల్, రాహుల్ చాదవ్ తాము ఆడిన మొదటి రౌండ్ మ్యాచ్‌ల్లోనే పరాజయాలను చవిచూశారు.

ఇండియన్ సూపర్ లీగ్
పుణే క్లబ్ ఓటమి
పుణే, అక్టోబర్ 12: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో పుణే క్లబ్ హోం గ్రౌండ్‌లోనే ఓటమిపాలైంది. నార్త్ ఈస్ట్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌ని 0-1 తేడాతో చేజార్చుకుంది. ఈ టోర్నీలో కొనసాగుతున్న మితిమీరిన రక్షణాత్మక విధానం ఈ మ్యాచ్‌లోనూ కనిపించింది. దీనితో ప్రథమార్ధంలో ఇరు జట్లు గోల్స్ చేయలేకపోయాయి. ద్వితీయార్ధంలో చాలా సేపు దాదాపు ఇలాంటి పరిస్థితే కొనసాగింది. 79వ నిమిషంలో ఎమిలియానో అల్ఫ్రారో గోల్ చేయడంతో 1-0 ఆధిక్యానికి చేరిన నార్త్ ఈస్ట్ జట్టు మరింత జాగ్రత్తగా ఆడుతూ అదే స్కోరు వద్ద మ్యాచ్‌ని ముగించింది. కాగా, ఈ టోర్నీలో గురువారం నాటి మ్యాచ్‌లో నిరుటి ఫైనలిస్టు జట్లు గోవా ఫుట్‌బాల్ క్లబ్, చెనె్నయిన్ పోటీపడతాయి.