క్రీడాభూమి

కెనడాతో భారత్ తొలి మ్యాచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: లక్నోలో డిసెంబర్ 8 నుంచి 18వ తేదీ వరకు జరిగే ఎఫ్‌ఐహెచ్ జూనియర్ హాకీ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో పోటీపడుతున్న భారత జట్టు మొదటి మ్యాచ్‌ని కెనడాతో ఆడుతుంది. కేవలం ఒక విశ్రాంతి దినంతో ఈ టోర్నీని మేజర్ ధ్యాన్ చంద్ హాకీ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 16 దేశాల నుంచి వచ్చే యువ ఆటగాళ్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతుందని విశే్లషకుల అభిప్రాయం. వీరిలో చాలా మంది తమతమ జాతీయ జట్లలో ఇప్పటికే స్థానం సంపాదించిన వారు లేదా స్థానం కోసం తీవ్రంగా పోటీపడుతున్న వారు కావడం విశేషం. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, కెనడాతోపాటు భారత్ పూల్ ‘డి’ నుంచి ఈ టోర్నీలో టైటిల్ వేటను కొనసాగిస్తుంది. పూల్ ‘ఎ’లో ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, అర్జెంటీనా, ఆస్ట్రియా జట్లు ఉన్నాయి. పూల్ ‘బి’ నుంచి బెల్జియం, ఈజిప్టు, నెదర్లాండ్స్, పాకిస్తాన్ జట్లు బరిలోకి దిగుతాయి. పూల్ ‘సి’లో జపాన్, న్యూజిలాండ్, జర్మనీ, స్పెయిన్ జట్లు హోరాహోరీకి సిద్ధమవుతున్నాయి.