క్రీడాభూమి

వలెన్షియా టోర్నీకి భారత కెప్టెన్‌గా హర్జీత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: వలెన్షియాలో ఈనెల 24 నుంచి 30వ తేదీ వరకు జరిగే జూనియర్ హాకీ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టుకు హర్జీత్ సింగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. దిస్పాన్ టిర్కీ అతనికి డిప్యూటీగా సేవలు అందిస్తాడు. రియో ఒలింపిక్స్‌లో సీనియర్ హాకీ జట్టు గోల్‌కీపర్ శ్రీజేష్‌కు స్టాండ్‌బైగా ఉన్న వికాస్ దహియా ఈ టోర్నీలో గోల్‌కీపర్‌గా ఉంటాడు. ఇటీవల ఆస్ట్రేలియా హాకీ లీగ్‌లో పాల్గొని, హ్యాట్రిక్ సాయంతో మొత్తం ఏడు గోల్స్ సాధించిన వరుణ్ కుమార్, గురీందర్ సింగ్, దిస్పాన్ టిర్కీ, హర్మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, ఆనంద్ లాక్రాలతో భారత రక్షణ వలయం పటిష్టంగా ఉంది. మిడిల్ ఆర్డర్‌లో కెప్టెన్ హర్జీత్ సింగ్, నీలకంఠ శర్మ, శాంతా సింగ్, సమీత్, శంషేర్ సింగ్ ఉన్నారు. ఫార్వర్డ్ విభాగంలో ఆస్ట్రేలియా లీగ్‌లో నాలుగు గోల్స్ చేసిన అర్మాన్ ఖురేషీ కూడా కీలక పాత్ర పోషించనున్నాడు. అతనితోపాటు మన్‌ప్రీత్, గుర్జంత్ సింగ్, పర్వీందర్ సింగ్, అజయ్ యాదవ్, సిమ్రన్‌జిత్ సింగ్, అజిత్ కుమార్ పాండే డిఫెండర్లుగా సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈనెల 24న జరిగే మొదటి మ్యాచ్‌లో 2013 జూనియర్ ప్రపంచ కప్ విజేత జర్మనీతో జరిగే మ్యాచ్‌తో భారత్ టైటిల్ వేటను ప్రారంభిస్తుంది.