క్రీడాభూమి

అథ్లెటిక్స్‌కు జెస్సికా గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, అక్టోబర్ 13: ‘గోల్డెన్ గర్ల్’గా క్రీడా ప్రపంచానికి సుపరచితురాలైన జెస్సికా ఎన్నిస్ హిల్ కెరీర్‌కు తెరదించింది. అథ్లెటిక్స్ నుంచి గుడ్‌బై చెప్తున్నట్టు ఆమె ఒక ప్రకటనలో తెలిపింది. ‘కెరీర్‌లో ఉన్నత స్థానాన్ని అందుకోవాలని అనుకున్నాను. అందుకు తగినట్టు కృషి చేశాను. చక్కటి ఫలితాలను సాధించాను. కెరీర్‌కు గుడ్‌బై చెప్పడం అనుకున్నంత సులభం కాదు. కానీ, ఏదో ఒక సమయంలో రిటైర్మెంట్ తప్పదు. కెరీర్ మొత్తంలో ఎక్కడా పశ్చాత్తాప పడాల్సిన అవసరం రాలేదు. సంతోషంగానే నేను కెరీర్‌ను ముగిస్తున్నాను’ అని పేర్కొంది. అత్యంత కష్టమైన హెప్ట్థ్లాన్, పెంటాథ్లాన్‌లలో నైపుణ్యాన్ని సంపాదించిన జెస్సికా 2009, 2015 సంత్సరాల్లో హెప్ట్థ్లాన్ విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో అదే విభాగంలో స్వర్ణ పతకాన్ని అందుకుంది. 1986 జనవరి 28న జన్మించిన జెస్సికా చిన్నతనంలోనే అథ్లెటిక్స్‌లో ప్రావీణ్యాన్ని ప్రదర్శించింది. హెప్ట్థాన్, పెంటాథ్లాన్‌లతోపాటు 100 మీటర్ల హర్డిల్స్‌లోనూ ప్రతిభావంతురాలిగా పేరు సంపాదించింది. 2004 కామనె్వల్త్ యూత్ గేమ్స్ మహిళల 100 మీటర్ల హర్డిల్స్, హై జంప్ విభాగాల్లో రజత పతకాలను కైవసం చేసుకోవడంతో ఆమె జైత్ర యాత్ర మొదలైంది. ప్రపంచ హెప్ట్థ్లాన్ ర్యాంకింగ్స్‌లో మూడుసార్లు (2009, 2010, 2012) నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. ఇండోర్ పెంటథ్లాన్‌లోనూ ప్రపంచ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకుంది. లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిన ఆమె ఈ ఏడాది రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని అందుకుంది. బహుముఖ ప్రజ్ఞాశాలిగా బ్రిటిష్ అథ్లెటిక్స్‌లో కొత్త అధ్యాయాన్ని సృష్టించిన ఆమె కెరీర్‌లో 16 మేజర్ టైటిళ్లను గెల్చుకుంది. వీటిలో 8 స్వర్ణాలుకాగా, ఐదు రజతాలు. ఆమె ఖాతాలో మూడు కాంస్య పతకాలు కూడా ఉన్నాయి.