క్రీడాభూమి

ఈ టైటిళ్లు నాకొద్దు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, అక్టోబర్ 13: తాను సాధించిన డబ్ల్యుబిఓ, డబ్ల్యుబిఎ ప్రపంచ హెవీవెయిట్ టైటిళ్లను వాపసు ఇచ్చేస్తున్నానని బ్రిటన్‌కు చెందిన వివాదాస్పద బాక్సర్ టైసన్ ఫ్యూరీ ప్రకటించాడు. తీవ్రమైన మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు తాను కొకైన్‌ను వాడినట్టు అతను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేసి, సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాను కొకైన్‌ను వాడానని, అయితే అందులో తప్పేమీ లేదని సమర్ధించుకున్నాడు. తన జీవితాన్ని తన ఇష్టానుసారంగా గడిపే హక్కు తనకు ఉందన్నాడు. ‘నా ఇష్టం.. ఏమైనా చేస్తా..’ అంటూ, ఎవరూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నాడు. ఫ్యూరీ ప్రకటన అనంతరం అతని బాక్సింగ్ లైసెన్స్‌ను రద్దు చేయాలని అంతర్జాతీయ బాక్సింగ్ అధికారులు తీర్మానించారు. ఈ నిర్ణయం వెలువడిన కొన్ని నిమిషాల్లోనే తాను టైటిళ్లను వాపసు ఇచ్చేస్తున్నానని ఫ్యూరీ ప్రకటించాడు. తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యానని, అందుకే కొకైన్‌ను వాడాల్సి వచ్చిందని తాజా ప్రకటనలో అతను వివరణ ఇచ్చాడు. ఏ క్షణంలోనైనా ఆత్మహత్య చేసుకుంటానేమోనని భయపడుతున్నట్టు చెప్పాడు. వైద్య సేవలు పొంది, మళ్లీ సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పడుతుందని అతను పేర్కొన్నాడు. అప్పటి వరకూ టైటిళ్లను తన వద్ద ఉంచుకోవడంలో అర్థం లేదని స్పష్టం చేశాడు. ఔత్సాహికులు ఎవరైనా పోటీ పడేందుకు వీలుగా టైటిళ్లను తన వద్ద ఉంచుకోరాదని అనుకుంటున్నట్టు చెప్పాడు. ఇది తన సొంత నిర్ణయమేనని 28 ఏళ్ల ఫ్యూరీ అన్నాడు. డబ్ల్యుబిఎ, డబ్ల్యుబివో టైటిళ్లను నిలబెట్టుకోవడానికి వ్లాదిమిర్ క్లిచెకోతో బౌట్‌ను రద్దు చేసుకున్నానని, కాబట్టి ఇప్పట్లో రింగ్‌లోకి దిగే ఆలోచన తనకు లేదని తెలిపాడు. తాను చాలాకాలంగా ప్రాక్టీస్‌కు దూరంగా ఉంటున్నానని ఫ్యూరీ తన ప్రకటనలో తెలిపాడు. కెరీర్‌లో పాల్గొన్న మొత్తం 25 ఫైట్స్‌లోనూ అతను విజయాలు సాధించాడు. వీటిలో నాకౌట్ విజయాలు 18 ఉన్నాయి. ఇలావుంటే, ప్రపంచ హెవీవెయిట్ టైటిళ్లను మాత్రమే తిరిగి ఇస్తున్నట్టు ఫ్యూరీ ప్రకటనలో స్పష్టంగా ఉంది. మాదక ద్రవ్యాలు వాడిన కారణంగా, మిగతా టైటిళ్లను కూడా ప్రపంచ బాక్సింగ్ అధికారులు రద్దు చేస్తారా లేక అతని వద్దే ఉండనిస్తారా అన్నది ఇంకా తేలలేదు.

చిత్రం.. టైసన్ ఫ్యూరీ