క్రీడాభూమి

వార్నర్ శ్రమ వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేప్ టౌన్, అక్టోబర్ 13: దక్షిణాఫ్రికాలో ప్రపంచ వనే్డ చాంపియన్ ఆస్ట్రేలియాకు చేదు అనుభవం ఎదురైంది. చివరిదైన ఐదో వనే్డను 31 పరుగుల తేడాతో కోల్పోయిన ఈ జట్టుపై దక్షిణాఫ్రికా 5-0 తేడాతో క్లీన్‌స్వీప్ సాధించింది. డేవిడ్ వార్నర్ అసాధారణ బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించినప్పటికీ, అతని శ్రమ వృథా అయింది. ఆస్ట్రేలియాకు వైట్‌వాష్ తప్పలేదు. అప్పటికే సిరీస్‌ను చేజార్చుకున్న ఆసీస్ చివరి మ్యాచ్‌ని గెలవడం ద్వారా కొంతలో కొంతైనా పరువు నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో బరిలోకి దిగినప్పటికీ ఆస్ట్రేలియా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 327 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు సాధించింది. రిలీ రూసో 118 బంతుల్లో 122 పరుగులు సాధించగా, జీన్ పాల్ డుమినీ 75 బంతులు ఎదుర్కొని 73 పరుగులు చేశాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 178 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి దక్షిణాఫ్రికాను ఆదుకున్నారు. కేవలం 52 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టిన ఆస్ట్రేలియా తన పట్టును కొనసాగించలేకపోవడంతో దక్షిణాఫ్రికా 300 పరుగుల మైలురాయిని అధిగమించగలిగింది.
చివరి వనే్డలో గెలిచి, వైట్‌వాష్ నుంచి తప్పించుకోవడానికి 328 పరుగులు సాధించాల్సి ఉండగా, ఓపెనర్ డేవిడ్ వార్నర్ క్రీజ్‌లో నిలదొక్కుకొని, భారీ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి అతనికి సరైన సహకారం లభించలేదు. 136 బంతులు ఎదుర్కొని, 24 ఫోర్లతో 173 పరుగులు చేసిన వార్నర్ తొమ్మిదో వికెట్ రూపంలో రనౌటయ్యాడు. అతని తర్వాత జట్టులో అత్యధికంగా మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ చెరి 35 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేల్ అబోట్, కాగిసో రబదా, ఇమ్రాన్ తాహిర్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
సంక్షిప్త స్కోర్లు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 8 వికెట్లకు 327 (రిలీ రూసో 122, డేవిడ్ మిల్లర్ 39, క్రిస్ ట్రెమెన్ 3/64, జో మెన్నీ 3/49, స్కాట్ బోలాండ్ 2/68).
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: 48.2 ఓవర్లలో 296 ఆలౌట్ (డేవిడ్ వార్నర్ 173, మిచెల్ మార్ష్ 35, ట్రావిస్ హెడ్ 35, కేల్ అబోట్ 2/48, కాగిసో రబదా 2/84, ఇమ్రాన్ తాహిర్ 2/42).

చిత్రం.. ఆస్ట్రేలియాను ఆదుకోవడానికి విఫలయత్నం చేసిన వార్నర్ (173)