క్రీడాభూమి

పాకిస్తాన్ ఫుట్‌బాలర్ షహిలా దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, అక్టోబర్ 14: పాకిస్తాన్ మహిళా సాకర్ జట్టు స్ట్రయికర్ షహిలా అహ్మద్‌జయ్ బలూచ్ ఇక్కడ జరిగిన ఒక కారు ప్రమాదంలో మృతి చెందింది. 2014 శాఫ్ చాంపియన్‌షిప్స్‌లో పాకిస్తాన్ జాతీయ జట్టుకు ఆడిన ఆమె తన దేశం తరఫున విదేశాల్లో హ్యాట్రిక్ సాధించిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. 21 సంవత్సరాల వయసులో ఉత్తమ స్ట్రయికర్‌గా పేరు సంపాదించింది. ఇటీవలే ఆమెకు ఫదీయన్ బలూచ్‌తో నిశ్చితార్థం కూడా జరిగింది. అతనితో కలిసి ఒక రెస్టారెంట్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా, ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఇనుప గ్రిల్‌ను ఢీకొట్టినట్టు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో కారు వెనుక సీట్లో కూర్చున్న షహిలా అక్కడికక్కడే మృతి చెందిందని చెప్పారు. రెండేళ్ల క్రితం ఇస్లామాబాద్‌లో జరిగిన శాఫ్ చాంపియన్‌షిప్స్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లోనే భూటాన్‌పై పాకిస్తాన్ 4-1 తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఆమె సోదరి రహీలా జమాన్ పాకిస్తాన్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నది. ఆమె తల్లి రుబీనా ఇర్ఫాన్ పార్లమెంటు సభ్యురాలు. అంతేగాక, పాకిస్తాన్ మహిళల ఫుట్‌బాల్ సమాఖ్య చైర్‌పర్సన్‌గానూ వ్యవహరిస్తున్నది. ఫుట్‌బాల్ నేపథ్యంలోనే పెరిగిన షహిలా ఆ ఆటపై మక్కువ పెంచుకుంది. అసాధారణ ప్రతిభాపాటవాలను ప్రదర్శించి, పాక్ జట్టులో స్థిరమైన స్థానాన్ని సంపాదించింది. ఆమె మృతి పట్ల పాక్ క్రీడా సంఘాలు, సమాఖ్యలు సంతాపం వ్యక్తం చేశాయి.