క్రీడాభూమి

ఠాకూర్ అఫిడవిట్‌పై బిసిసిఐలో చర్చ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: లోధా కమిటీ సిఫార్సులను అమలు చేసే విషయమై సుప్రీం కోర్టులో బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సమర్పించబోయే అఫిడవిట్‌పై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే బోర్డు న్యాయ నిపుణుల బృందం అఫిడవిట్‌ను సిద్ధం చేయడంలో నిమగ్నమైంది. కాగా, శనివారం ఇక్కడ జరిగే బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జిఎం)లో ఈ అఫిడవిట్‌పై చర్చ జరగనుంది. క్రీడల్లో ప్రభుత్వాల జోక్యం ఉండరాదని ఒలింపిక్ చాప్టర్ స్పష్టం చేస్తున్నది. అంతర్జాతీయ క్రీడా వివాదాల మధ్యవర్తిత్వ కోర్టు కూడా ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో గుర్తుచేసింది. బిసిసిఐ పాలక మండలిలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ప్రతినిధి ఒకరు ఉండాలన్నది లోధా కమిటీ చేసిన సిఫార్సుల్లో ఒకటి. కాగ్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థకాబట్టి, దాని ప్రతినిధిని బోర్డులోకి తీసుకోవడం అనేది ప్రభుత్వ జోక్యం కిందకు వస్తుందా? రాదా? అన్నది తేల్చాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)కి ఠాకూర్ లేఖ కూడా రాశాడు. అఫిడవిట్‌లో అతను ఇదే వాదనను వినిపించే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా ‘ఒక రాష్ట్రానికి ఒకే ఓటు’ ప్రతిపాదనను కూడా బిసిసిఐ వ్యతిరేకిస్తున్నది. దీని వల్ల దేశ క్రికెట్‌కు విశేష సేవలు అందించిన ముంబయి క్రికెట్ సంఘం (ఎంసిఎ), రైల్వేస్ తదితర యూనిట్ల ఉనికి లేకుండాపోతుందని అంటున్నది. కొన్ని రాష్ట్రాలు, ప్రత్యేకంగా ఈశాన్య రాష్ట్రాల నుంచి క్రికెట్‌కు ప్రాతినిథ్యం చాలా తక్కువన్న విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నది. క్రికెట్ అసలే లేని కొన్ని రాష్ట్రాలకు ఓటు హక్కు లభించడం, క్రికెట్ అభివృద్ధికి పాటుపడుతున్న యూనిట్లు ఆ హక్కును కోల్పోవాల్సి రావడం దురదృష్టకరమని బోర్డు వ్యాఖ్యానిస్తున్నది. ఠాకూర్ సమర్పించే అఫిడవిట్‌లో ఈ అంశం కూడా చేరే అవకాశం ఉంది. వరుసగా రెండు పర్యాయాలు బోర్డు పాలక మండలికి ఎన్నికైతే, మూడోసారి పోటీ చేయకుండా ఒక టెర్మ్ ‘విశ్రాంతి’ తీసుకోవాలని లోధా కమిటీ సూచించింది. ఇది కూడా ఆచరణ యోగ్యం కాదని బోర్డు స్పష్టం చేస్తున్నది. ఈ వాదనలను సుప్రీం కోర్టు వింటుందా లేక ముందుగా హెచ్చరించిన విధంగా ఆదేశాలు జారీ చేస్తుందా అన్నది చూడాలి.