క్రీడాభూమి

మూడోస్థానంపై భారత్ కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాల, అక్టోబర్ 15: ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇప్పటికే నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించిన భారత్ ఇప్పుడు వనే్డల్లో మెరుగైన స్థానాన్ని సంపాదించడమే లక్ష్యంగా ఎంచుకుంది. ప్రస్తుత ర్యాంకింగ్స్ ప్రకారం ఆస్ట్రేలియా 118 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. దక్షిణాఫ్రికా 116 పాయింట్లు సంపాదించి రెండో స్థానంలో ఉండగా, న్యూజిలాండ్ (113 పాయింట్లు), భారత్ (110 పాయింట్లు) వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. న్యూజిలాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ కనీసం 4-1 తేడాతో గెల్చుకుంటే, మూడో స్థానానికి చేరుతుంది. కివీస్ నాలుగో స్థానానికి పడిపోతుంది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం (హెచ్‌పిసిఎ) మైదానంలో సోమవారం జరిగే మొదటి మ్యాచ్‌తో వనే్డ యుద్ధానికి మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని టీమిండియా సిద్ధమైంది.
ర్యాంకింగ్స్‌ను పరిగణలోకి తీసుకుంటే, న్యూజిలాండ్ బలంగా కనిపిస్తున్నప్పటికీ, స్వదేశంలో మ్యాచ్‌లు ఆడడం భారత్‌కు లాభించనుంది. బ్యాటింగ్ విభాగంలో భారత స్టార్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. ఇటీవలే న్యూజిలాండ్‌పై టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన అతను మళ్లీ ఫామ్‌లోకి రావడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. రోహిత్ శర్మ ఏడో స్థానాన్ని దక్కించుకున్నాడు. కాగా, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ ఐదు, ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ ఆరు స్థానాల్లో ఉన్నారు. పదో స్థానంలో ఉన్న శిఖర్ ధావన్‌కు మొదటి మూడు వనే్డలకు ప్రకటించిన భారత జట్టులో స్థానం లభించలేదు. ర్యాంకింగ్స్‌తో సంబంధం లేకుండా, బలాబలాలను చూస్తే, బ్యాటింగ్ విభాగంలో కివీస్ కంటే భారత్ పటిష్టంగా ఉంది. ఎనిమిదో స్థానం వరకూ పరుగుల వరద పారించే సత్తా ఉన్న ఆటగాళ్లు టీమిండియాలో ఉన్నారు.
బౌలింగ్ విభాగంలో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌలర్ అగ్రస్థానాన్ని ఆక్రమించగా, స్పిన్నర్ మాట్ హెన్రీ ఐదో స్థానంలో ఉన్నాడు. భారత బౌలర్లలో ఎవరూ ‘టాప్-10’లో లేరు. 13వ స్థానంలో ఉన్న స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. టెస్టు ర్యాంకింగ్స్ బౌలింగ్, ఆల్‌రౌండర్స్ విభాగాల్లో నంబర్ వన్‌గా ఎదిగాడు. అయితే, రాబోయే టెస్టు సిరీస్‌లను దృష్టిలో ఉంచుకొని సెలక్టర్లు అతనికి ఈ వనే్డ సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చాడు. దీనితో ప్రస్తుతం జట్టులో ఉన్న బౌలర్లలో అక్షర్ పటేల్‌ను అత్యుత్తమ భారత బౌలర్‌గా పేర్కోవాలి. అతను ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో నిలిచాడు. టెస్టు సిరీస్‌లో రాణించిన అశ్విన్, రవీంద్ర జడేజా వనే్డ జట్టులో లేకపోవడంతో, భారం ఎక్కువగా ధవళ్ కులకర్ణి, ఉమేష్ యాదవ్‌పై పడనుంది. వీరు ఎంత వరకూ కివీస్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తారో చూడాలి. స్వదేశంలో పిచ్‌లు ఎంత వరకు సహకరిస్తాయో తెలియని పరిస్థితి. అదనపులాభం చేకూరితే తప్ప న్యూజిలాండ్‌పై భారత బౌలర్లు ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉండదు. మొత్తం మీద బౌలింగ్‌లో న్యూజిలాండ్, బ్యాటింగ్‌లో భారత్ పటిష్టంగా కనిపిస్తుండగా, వనే్డ సిరీస్ ఉత్కంఠ భరితంగా సాగడం ఖాయంగా కనిపిస్తున్నది. టెస్టుల్లో మాదిరి మ్యాచ్‌లు ఏక పక్షంగా జరగకుండా ఆసక్తిని రేపే వి ధంగా ఉండాలన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. పిచ్‌లను భారత క్యూరే టర్లు ఏ విధంగా తీర్చిదిద్దుతున్నారనేది ఆదివారం నాటి తొలి వనే్డ మ్యాచ్ తీరును బట్టి స్పష్టమవుతుంది.
మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం
12.30 గంటలకు మొదలు

అదే దూకుడు..
ధర్మశాల: న్యూజిలాండ్‌పై టెస్టు సిరీస్‌లో ప్రదర్శించిన దూకుడునే ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లోనూ కొనసాగించాలని టీమిండియా నిర్ణయించింది. ఈ విషయాన్ని యువ బ్యాట్స్‌మన్ ఆజింక్య రహానే స్పష్టం చేయగా, కెప్టెన్ ధోనీ పరోక్షంగా చెప్పాడు. టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయాలు, సూచనలను స్వీకరిస్తానని చెప్పాడు. మైదానంలో ధోనీ ఎప్పుడూ నింపాదిగా ఉంటే, కోహ్లీ దూకుడుగా నిర్ణయాలు తీసకుంటాడన్నది అందరికీ తెలిసిన విషయమే. కోహ్లీ సలహాలు అవసరమని చెప్పడం ద్వారా వనే్డ సిరీస్‌లో అనుసరించబోయే వ్యూహాన్ని ధోనీ చెప్పకనే చెప్పాడు.

మొదటి మూడు మ్యాచ్‌లకు
భారత జట్టు ఇదే
మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఆజింక్య రహానే, మనీష్ పాండే, సురేష్ రైనా, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, అమిత్ మిశ్రా, జస్‌ప్రీత్ బుమ్రా, ధవళ్ కులకర్ణి, ఉమేష్ యాదవ్, మన్దీప్ సింగ్, కేదార్ జాదవ్.
* అనారోగ్యం వల్ల సురేష్ రైనా మొదటి మ్యాచ్‌కి అందుబాటులో ఉండడు.