క్రీడాభూమి

హర్యానా చేతిలో హైదరాబాద్ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెంషెడ్పూర్, అక్టోబర్ 16: హర్యానాతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌ని హైదరాబాద్ ఎనిమిది వికెట్ల తేడాతో చేజార్చుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులు చేయగా, హర్యానా 331 పరుగులు సాధించింది. మొదటి ఇన్నింగ్స్‌లో 140 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన హర్యానా రెండో ఇన్నింగ్స్‌లో హైదరాబాద్‌ను 225 పరుగులకే అలౌట్ చేసింది. 85 పరుగుల విజయ లక్ష్యాన్ని 16.4 ఓవర్లలో రెండు వికెట్లు చేజార్చుకొని ఛేదించింది.
చత్తీస్‌గఢ్‌లో జరిగిన మ్యాచ్‌లో స్థానిక జట్టును ఢీకొన్న ఆంధ్ర డ్రాతో బయటపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర 199 పరుగులకే ఆలౌటైంది. అనంతరం చత్తీస్‌గఢ్ మొదటి ఇన్నింగ్స్‌లో 394 పరుగుల భారీ స్కోరు సాధించింది. మొదటి ఇన్నింగ్స్‌లో 195 పరుగులు వెనుకబడిన ఆంధ్ర రెండో ఇన్నింగ్స్‌లో చివరి వరకూ పోరాటం సాగించి, మ్యాచ్ డ్రాగా ముగిసే సమయానికి ఎనిమిది వికెట్లకు 282 పరుగులు చేసింది.
ఇతర మ్యాచ్‌ల విషయానికి వస్తే, బరోడా, ముంబయి మ్యాచ్ డ్రా అయింది. బరోడా తొలి ఇన్నింగ్స్‌లో 305 పరుగులు చేసింది. అందుకు సమాధానంగా ముంబయి మొదటి ఇన్నింగ్స్‌లో 323 పరుగులు సాధించి, 18 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. రెండో ఇన్నింగ్స్‌ను బరోడా ఐదు వికెట్లకు 383 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా, చివరి రోజు ఆట డ్రాగా ముగిసే సమయానికి ముంబయి రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లకు 224 పరుగులు సాధించింది.
త్రిపుర ఘన విజయం
సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో త్రిపుర 219 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 275 పరుగులు చేయగా, సర్వీసెస్ 233 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను త్రిపుర మూడు వికెట్లకు 340 పరుగుల స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. అసాధ్యంగా కనిపిస్తున్న 383 పరుగుల భారీ విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన సర్వీసెస్ 54.1 ఓవర్లలో 163 పరుగులకే ఆలౌటైంది.
మరో మ్యాచ్‌లో పంజాబ్ 126 పరుగుల ఆధిక్యంతో మధ్యప్రదేశ్‌పై గెలిచింది. ఉత్తర ప్రదేశ్, బెంగాల్ జట్ల మధ్య మ్యాచ్ డ్రాగా ముగిసింది. తమిళనాడు 174 పరుగుల తేడాతో రైల్వేస్‌ను చిత్తుచేసింది. ఒడిషా 32 పరుగుల ఆధిక్యంతో సౌరాష్టన్రు ఓడించింది. రంజీ రికార్డులను తిరగరాసిన మహారాష్ట్ర, ఢిల్లీతోపాటు జార్ఖండ్, కర్నాటక జట్లు కూడా మ్యాచ్‌ని డ్రాగా ముగించాయి.