క్రీడాభూమి

లోధా కమిటీ సిఫారసుల అమలుపై మరింత స్పష్టత అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును సంస్కరించి, సమూలంగా ప్రక్షాళన చేసేందుకు జస్టిస్ లోధా కమిటీ చేసిన సిఫారసులను అమలు చేయడంపై రాష్ట్రాల క్రికెట్ సంఘాలు ప్రస్తుతం తీవ్రమైన గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్నాయని, ఈ సిఫారసులను అమలు చేయడంపై మరింత స్పష్టతకు వచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సోమవారం స్పష్టం చేశారు. లోధా కమిటీ సిఫారసుల అమలులో జరుగుతున్న జాప్యానికి సుప్రీం కోర్టు నుంచి బిసిసిఐ పదేపదే విమర్శలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన ఈ వివరణ ఇచ్చారు. దీంతో ఈ సిఫారసుల అమలు విషయమై సోమవారం బిసిసిఐకి ఇవ్వాల్సిన తీర్పును సుప్రీం కోర్టు రిజర్వు చేసింది. ‘జస్టిస్ లోధా కమిటీ చేసిన సిఫారసులను ఆమోదించేందుకు నాలుగింట మూడు వంతుల మెజార్టీ కావాలి. అయినప్పటికీ ఈ విషయంలో రాష్ట్రాల క్రికెట్ సంఘాలను సంప్రదించి మా పని మేము చేశాం. ఇక దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్రాల క్రికెట్ సంఘాలే. మూడు వంతుల మెజార్టీ లేకపోతే ఈ సిఫారసులను ఆమోదించడం అసాధ్యం’ అని సుప్రీం కోర్టులో సోమవారం విచారణ పూర్తయిన తర్వాత అనురాగ్ ఠాకూర్ విలేఖర్లతో అన్నారు. లోధా కమిటీ సిఫారసులను ఎలా అమలు చేయాలన్న దానిపై ప్రస్తుతం రాష్ట్రాల క్రికెట్ సంఘాలు తీవ్రమైన గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్నాయని, దీనిపై మరింత స్పష్టత రావల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ముఖ్యంగా ఒక రాష్ట్రానికి ఓకే ఓటు, క్రికెట్ సంఘాల్లో ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలని, ఈ పదవులను చేపట్టే వ్యక్తుల వయసు 70 సంవత్సరాల లోబడి ఉండాలని, అలాగే ఒకసారి పదవి చేపట్టిన వ్యక్తులు మరోసారి పదవి చేపట్టేందుకు మధ్యలో మూడేళ్ల విరామం ఉండి తీరాలన్న లోధా కమిటీ కీలక సిఫారసులను అమలు చేయడంలో ఆచరణాత్మకంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న విషయాన్ని సుప్రీం కోర్టుకు మరోసారి విన్నవించినట్లు ఆయన తెలిపారు.
ఐసిసిని సంప్రదించలేదు..
ఇదిలావుంటే, లోధా కమిటీ సిఫారసుల విషయమై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నుంచి తాను ఎటువంటి లేఖనూ కోరలేదని సోమవారం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ (ప్రమాణ పత్రం)లో అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. అయితే లోధా కమిటీ సిఫారుసులు రోజు వారీ క్రికెట్ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యానికి దారితీస్తాయా? అనే విషయంపై వివరణ పొందేందుకు ఐసిసి అధ్యక్షుడు శశాంక్ మనోహర్‌తో మాట్లాడిన మాట నిజమేనని బిసిసిఐ చీఫ్ అంగీకరించాడు. ఆగస్టు 6, 7 తేదీల్లో దుబాయ్‌లో జరిగిన ఐసిసి ఆర్థిక సమీక్షా సమావేశం సందర్భంగా తాను ఈ విషయం గురించి శశాంక్ మనోహర్‌తో మాట్లాడినట్లు అనురాగ్ ఠాకూర్ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.