క్రీడాభూమి

ఐఓసి అథ్లెట్ల కమిషన్ సభ్యురాలిగా సైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 18: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) అథ్లెట్ల కమిషన్ సభ్యురాలిగా ఆమె నియమితురాలైంది. ఈ మేరకు ఐఓసి అధ్యక్షుడు థామస్ బాచ్ నుంచి మంగళవారం రాత్రి సైనా నెహ్వాల్‌కు లేఖ అందింది. ‘రియో ఒలింపిక్స్ సందర్భంగా ఐఓసి అథ్లెట్ల కమిషన్ ఎన్నికల్లో మీ అభ్యర్థిత్వం తర్వాత చైర్మన్‌తో సంప్రదించి అథ్లెట్ల కమిషన్ సభ్యురాలిగా మిమ్మల్ని నియమించామని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాం’ అని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆ లేఖలో పేర్కొంది. ప్రస్తుతం ఏంజెలా రగియెరో అధ్యక్షతన గల అథ్లెట్ల కమిషన్‌లో తొమ్మిది మంది ఉపాధ్యక్షులు, మరో పది మంది ఇతర సభ్యులు ఉన్నారు. ఈ కమిషన్ తదుపరి సమావేశం వచ్చే నెల 6వ తేదీన జరుగనుంది. మోకాలి గాయం నుంచి సైనా నెహ్వాల్ కోలుకుని మళ్లీ ప్రాక్టీస్ ప్రారంభించబోతున్న తరుణంలో ఆమెకు ఈ నియామక లేఖ అందింది. కుడి మోకాలి కీలు లోపల తగిలిన గాయంతో సైనా చాలా కాలం నుంచి తీవ్రంగా ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. అయితే ఈ గాయం నుంచి కోలుకుని పరిస్థితి మెరుగుపడితే నవంబర్ నుంచి టోర్నమెంట్లలో పాల్గొంటానని సైనా గత నెలలో పిటిఐ వార్తా సంస్థకు తెలియజేసింది.
అందరికీ గర్వకారణం : హర్వీర్ సింగ్
ఇదిలావుంటే, ఐఓసి అథ్లెట్ల కమిషన్ సభ్యురాలిగా సైనా నెహ్వాల్ నియమితురాలవడం పట్ల ఆమె తండ్రి హర్వీర్ సింగ్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ‘ఈ వార్త తెలిసిన వెంటనే ఎంతో భావోద్వేగానికి లోనయ్యా. సైనా సేవలను గుర్తించి ఐఓసిలో ఆమెకు చోటు కల్పించడం మనందరికీ ఎంతో గర్వకారణం. ఇందుకు ఎంతగానో సంతోషిస్తున్నా’ అని హర్వీర్ సింగ్ పేర్కొన్నాడు.