క్రీడాభూమి

రెండో వనే్డకీ రైనా దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: వైరల్ ఫీవర్ కారణంగా ధర్మశాలలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్‌డే మ్యాచ్‌లో ఆడలేక పోయిన సురేశ్ రైనా గురువారం ఇక్కడ ఆ జట్టుతో జరగనున్న రెండో వన్‌డేకు సైతం దూరం కానున్నాడు. రైనా మ్యాచ్ ఆడడానికి పూర్తిస్థాయిలో ఫిట్ కానందున అతను రెండో వన్‌డేలో కూడా ఆడడం లేదని బిసిసిఐమెడికల్ టీమ్ మంగళవారం ధ్రువీకరించింది. పూర్తిగా కోలుకోవడానికి సురేశ్ రైనాకు మరిన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడానికి బిసిసిఐ అనుమతిచ్చిందని, జట్టులో ఆయన స్థానంలో వేరే ఎవరినీ తీసుకోవడం లేదని బిసిసిఐ ఒక ప్రకటనలో తెలిపింది. మంగళవారం రైనా 45 నిమిషాల పాటు నెట్స్‌లోబ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. అయితే రైనా రెండో వన్‌డే అడడానికి నూరు శాతం ఫిట్‌గా లేడని భారత జట్టు మేనేజిమెంట్ భావించింది. 2016 అక్టోబర్ తర్వాత ఇప్పటివరకు రైనా భారత జట్టు తరఫున ఒక్క వన్‌డే కూడా ఆడలేదు. రకరకాల కారణాల వల్ల అతడికి ఆస్ట్రేలియాలో జరిగిన వన్‌డే మ్యాచ్‌లకు, అలాగే ఇటీవల టీమిండియా జింబాబ్వే పర్యటనకు, ఆ తర్వాత వెస్టిండీస్‌తో జరిగిన రెండుమ్యాచ్‌ల టి-20సిరీస్‌కు సైతం ఎంపిక చేయలేదు.