క్రీడాభూమి

ఐపిఎల్‌లోకి ఫేస్‌బుక్, ట్విట్టర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: అటు ఆటగాళ్లకు, ఇటు ప్రసార మాధ్యమాలకు కనక వర్షం కురిపిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లోకి అడుగుపెట్టడానికి ఫేస్‌బుక్ ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా నెట్‌వర్క్‌లు సైతం ఆసక్తి చూపిస్తున్నాయి. ఐపిఎల్ ప్రసార, డిజిటల్, మొబైల్ హక్కులను దక్కించుకోవడానికి టెండర్లను కొనుగోలు చేసిన 18 సంస్థల్లో ఈ రెండూ ఉన్నట్లు బిసిసిఐ సైతం ధ్రువీకరించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మీడియా హక్కుల టెండర్లకోసం ఆహ్వానానికి అద్భుతమైన స్పందన లభించిందని, ప్రముఖ మీడియా, టెక్నాలజీ సంస్థలనుంచి బ్రహ్మాండమైన స్పందన లభించిందని, బిసిసిఐ ఒక ప్రకటనలో తెలిపింది. టెండరు పత్రాల కొనుగోలుకు ఈ రోజుతో గడువు ముగిసింది. హక్కుల కోసం పోటీ పడుతున్న సంస్థల్లో ట్విట్టర్, ఫేస్‌బుక్‌లతో పాటు అమెజాన్, స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సోనీ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ జియో డిజిటల్ సర్వీసెస్ లాంటి దిగ్గజ సంస్థలున్నాయి. టీవీ, ఇంటర్నెట్, మొబైల్ హక్కుల విక్రయం ద్వారా దాదాపు 450 కోట్ల డాలర్ల ఆదాయం లభిస్తుందని బిసిసిఐ భావిస్తోంది. ఐపిఎల్ మీడియా హక్కులకోసం దాదాపు 18 దిగ్గజ సంస్థలు పోటీ పడుతుండడం చూస్తే ఐపిఎల్ పట్ల మార్కెట్ శక్తులకు ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుందని బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ అన్నాడు.