క్రీడాభూమి

కోహ్లీ బహుమతి.. గురువు భావోద్వేగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: విరాట్ కోహ్లీలో దాగి ఉన్న ప్రతిభకు సానబట్టి ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మన్‌గా ఎదిగేలా చేయడంలో అతని గురువు రాజ్‌కుమార్ శర్మ పాత్ర ఎంతో ఉందనేది నిర్వివాదాంశం. క్రమశిక్షణకు పెద్ద పీట వేసే ఆ ‘గురువు’ను విరాట్ కోహ్లీ 2014 గురుపూజోత్సవాల సందర్భంగా అనూహ్యమైన బహుమతితో అనిర్వచనీయమైన భావోద్వేగానికి గురి చేశాడు. ప్రముఖ క్రీడా రచయిత విజయ్ లోక్‌పల్లి విరాట్ కోహ్లీ జీవిత విశేషాలతో రాసిన ‘డ్రివెన్’ పుస్తకంలో ఆ మరిచిపోని మధురానుభూతి గురించి రాజ్‌కుమార్ శర్మ వివరించాడు. ‘కాలింగ్ బెల్ శబ్దం విని తలుపు తీసిన నాకు ఎదురుగా కోహ్లీ సోదరుడు వికాస్ కనిపించాడు. అంత ఉదయానే్న అతను వచ్చాడంటే ఏదో విశేషముంటుందని అనుకున్నాను. ఇంట్లోకి వచ్చిన వికాస్ ఫోన్‌లో ఒక నంబరు డయల్ చేసి నాకిచ్చాడు. అవతలివైపునుంచి కోహ్లీ గురుపూజోత్సవ శుభాకాంక్షలు చెబుతుండగా వికాస్ ఏవో తాళం చెవులు నా చేతిలో పెట్టాడు. ఏమిటని అడుగుతుండగానే అతను నన్ను తనతో ఇంటి బైటికి తీసుకెళ్లాడు. గేటు ముందు స్కోడా ర్యాపిడ్ కొత్త కారు మెరిసిపోతూ కనిపించింది. తన గురువుకు కోహ్లీ ఇచ్చిన గురుదక్షిణ అది. ఆ బహుమతి నాకు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు కానీ, ఇన్నాళ్లయినా నాతో అనుబంధాన్ని అతను ఎంత విలువైనవిగా భావించాడో వెల్లడించిన తీరు, తన జీవితంలో గురువుకు అతను ఇస్తున్న విలువ చూసి భావోద్వేగానికి గురయ్యాను’ అని రాజ్‌కుమార్ శర్మ ఆ పుస్తకంలో తెలిపారు.
‘చీకూ’ ముద్దుపేరు ఎలా వచ్చిందంటే..
ఈ భావోద్వేగ సంఘటనతో పాటుగా ఆ పుస్తకంలో మరో తమాషా అయిన సంఘటన కూడా ఉంది. కోహ్లీకి ‘చీకూ’ అనే ముద్దు పేరు ఉందనే విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. యువరాజ్ సింగ్ కోహ్లీని ఎప్పుడూ అదే పేరుతో పిలుస్తూ ఉంటాడు కూడా. ఇంతకీ కోహ్లీకి ఆ ముద్దు పేరు ఎలా వచ్చిందంటే.. ఢిల్లీ జట్టు ముంబయిలో రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడుతోంది. అప్పటికి కోహ్లీకి పది ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం కూడా లేదు. అయితే వీరేంద్ర సెవాగ్, గౌతమ్ గంభీర్, రజత్ భాటియా, మిథున్ మన్హాస్ లాంటి సీనియర్ ఆటగాళ్లతో నిండిన జట్టులో భాగమైనందుకే ఎంతో పొంగిపోతూ ఉండేవాడు. ఎప్పుడూ డ్రెస్సింగ్ రూమ్‌తో వాళ్లతో ఉండడానికి ఇష్టపడే వాడు. ఒక రోజు సాయంత్రం వాళ్లుండే హోటల్ పక్కనే ఉన్న ఫ్యాన్సీ హెయిర్ కటింగ్ సెలూన్‌లోకి వెళ్లి తన జుట్టును అందంగా కత్తిరించుకుని హోటల్‌కు వచ్చి జుట్టు ఎలా ఉందని అందరినీ అడిగాడు. ‘్ఫరవాలేదు. చీకూలాగా ఉన్నావు’ అని కాస్త దూరంలో ఉండిన జట్టు అసిస్టెంట్ కోచ్ అజిత్ చౌదరి నవ్వుతూ ఆటపట్టించాడు. కోహ్లీ ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో అదే పేరు స్థిరపడిపోయింది. ఇంతకీ చీకూ అంటే సపోటా పండని అర్థం.

చిత్రం.. ప్రియ శిష్యుడు విరాట్ కోహ్లీతో రాజ్‌కుమార్ శర్మ