క్రీడాభూమి

ఆటల కంటే ప్రాణాలే మిన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: క్రీడల కంటే భారతీయుల ప్రాణాలే ముఖ్యమని, కనుక సీమాంతర ఉగ్రవాదానికి అడ్డుకట్ట పడనంత వరకూ పాకిస్తాన్‌తో అన్ని రకాల సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలని టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. ‘పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడాలని నేను కూడా భావించడం లేదు. క్రీడల కంటే భారతీయుల ప్రాణాలే ముఖ్యం’ అని గంభీర్ మంగళవారం న్యూఢిల్లీలో విలేఖర్లతో అన్నాడు. రాజకీయాలను, క్రీడలను వేర్వేరుగా ఉంచాలని నీతులు చెప్పే భారతీయులంతా అంతకంటే ముందు సైనికుల బూట్లు ధరించాలని గంభీర్ డిమాండ్ చేశాడు. ‘సీమాంతర ఉగ్రవాదం అంతమయ్యే వరకూ పాకిస్తాన్‌తో ఎటువంటి సంబంధాలను కలిగి ఉండరాదన్న వాదనతో నేను ఏకీభివిస్తున్నా. పాక్ ప్రేరేపిత ఉగ్రమూకల హింసాకాండలో పిల్లలను కోల్పోయిన తండ్రులు, తండ్రులను కోల్పోయిన పిల్లల కోసం ప్రతి ఒక్కరూ సైనిక బూట్లు ధరించాలి’ అని గంభీర్ అన్నాడు. మన గురించి, మన దేశ ప్రజల గురించి స్వయంగా ఆలోచించలేనంత వరకూ ఎప్పటిమాదిరిగానే మనం ఏసీ రూముల్లో కూర్చుని రాజకీయాలతో బాలీవుడ్‌ను (సినిమాలను), క్రీడలను పోల్చరాదని చెబుతూనే ఉంటామని, అందుకే మన ప్రాణాలను, మన దేశ ప్రజల ప్రాణాలను కాపాడుకోలేనంత వరకూ మిగిలిన అన్ని వ్యవహారాలను పక్కన పెట్టాలని కోరుతున్నానని గంభీర్ (35) స్పష్టం చేశాడు.
పాకిస్తాన్ విషయంలో ఇటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న భారత క్రీడాకారుల్లో గంభీర్ ఒక్కడే మొదటివాడు కాదు. సరిగ్గా నెల రోజుల క్రితం జమ్మూ-కాశ్మీరులోని ఉరీలో పాక్ ప్రేరేపిత ముష్కరులు ఉగ్రదాడులకు తెగబడి 19 మంది భారత జవాన్ల ప్రాణాలను బలితీసుకోవడాన్ని భారత టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెవాగ్ తదితరులు కూడా ముక్తకంఠంతో ఖండించిన విషయం తెలిసిందే.
2008లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ముంబయిలో నరమేథం సృష్టించిన నాటి నుంచి దాయాది దేశంతో భారత క్రికెట్ జట్టు ఒక్క ద్వైపాక్షిక సిరీస్‌లో కూడా ఆడలేదు. 2009లో భారత జట్టు పాకిస్తాన్‌లో పర్యటించాల్సి ఉన్నప్పటికీ ముంబయి దాడుల నేపథ్యంలో ఆ పర్యటన రద్దయిన విషయం తెలిసిందే. అలాగే 2012 మార్చి-ఏప్రిల్ నెలల మధ్య ఇరు జట్ల మధ్య జరగాల్సిన మరో సిరీస్‌కు భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ఆ సిరీస్ కూడా రద్దయింది.