క్రీడాభూమి

ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ కొచ్చికి గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొచ్చి, అక్టోబర్ 19: మన దేశంలో వచ్చే ఏడాది జరిగే అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ‘్ఫఫా’ అండర్-17 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీలకు ఒక కేంద్రంగా కొచ్చికి గ్రీన్ సిగ్నల్ లభించింది. 23 మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి అధికారుల బృందం ఇక్కడి జవహర్ లాల్ నెహ్రూ స్టేడియాన్ని సందర్శించి, అక్కడి సౌకర్యాలను పరిశీలించింది. నిపుణులతో చర్చించిన తర్వాత, అండర్-17 వరల్డ్ కప్ పోటీలకు ఒక వేదికగా కొచ్చిని ప్రకటించింది. ఈ టోర్నీకి ఎంపికైన తొలి వేదిక ఇదే. స్టేడియంలో కొన్ని పనులు పూర్తికాల్సి ఉందని, అయితే, ఇప్పటి వరకూ చేసిన ఏర్పాట్లు, జరిగిన నిర్మాణాలను చూసిన తర్వాత, అవి సకాలంలో పూర్తవుతాయన్న నమ్మకం ఏర్పడిందని ఈ బృందం వ్యాఖ్యానించింది. కాగా, ప్రాక్టీస్‌కు ఎంపిక చేసిన పరేడ్ గ్రౌండ్, ఫోర్ట్ కొచ్చివెలి ఫుట్‌బాల్ గ్రౌండ్, మహారాజాస్ కాలేజ్ గ్రౌండ్, పనంపిల్లి నగర్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానాలను కూడా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ బృందం గురువారం ముంబయి నగరంలోని మైదానాలను పరిశీలిస్తుంది.