క్రీడాభూమి

బంగ్లాదేశ్ చేతిలో అర్జెంటీనా చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, అక్టోబర్ 19: ప్రపంచ కప్ కబ డ్డీ చాంపియన్‌షిప్‌లో బుధవారం జరిగిన మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో అర్జెంటీనా చిత్తయం ది. బంగ్లాదేశ్ 67 పాయంట్లు సాధించగా, అర్జెంటీ నా 26 పాయంట్లకే పరిమితమైంది. బంగ్లా ఆటగా డు తౌహిన్ తరఫ్దార్ అత్యధికంగా 16 పాయంట్లు చేశాడు. కెప్టెన్ అరుదుజామాన్ మున్షీ 13 పా యంట్లు సాధించాడు. వీరిద్దరే అర్జెంటీనా కంటే ఎక్కువ పాయంట్లు చేయడం గమనార్హం. అల్ మ మూన్ (10) కూడా పర్‌ఫెక్ట్ టెన్‌తో రాణించాడు. అర్జెంటీనా తరపున యుగెనియో పెటెర్మన్ ఎని మిది పాయంట్లు చేశాడు. నాహుయెల్ లొపేజ్ ఐ దు పాయంట్లు సాధించాడు. మిగతా వారు విఫ లం కావడంతో, అర్జెంటీనా ఏ దశలోనూ బంగ్లా దేశ్‌కు గట్టిపోటీ ఇవ్వలేకపోయంది. ఈ టోర్నీలో ఐదో మ్యాచ్ ఆడిన బంగ్లాదేశ్ మూడో విజయాన్ని నమోదు చేసింది. రెండు మ్యాచ్‌లను కోల్పోయన ఆ జట్టు మొత్తం 16 పాయంట్లతో గ్రూప్-ఎలో మూడో స్థానంలో నిలిచింది. ఈ పూల్‌లో దక్షిణ కొరియా 25, భారత్ 21 పాయంట్లతో మొదటి రెండు స్థానాలను ఆక్రమించాయ. ఒక్కోపూల్‌లో అగ్రస్థానాల్లో ఉన్న రెండు జట్లు సెమీ ఫైనల్‌కు చే రుతాయ. లీగ్ దశలో చివరి మ్యాచ్‌లు బుధవా రంతో ముగియడంతో, పూల్- ఎ నుంచి బంగ్లా దేశ్‌తోపాటు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, అర్జెంటీనా జట్లు కూడా టోర్నీ నుంచి నిష్క్రమించాయ. అర్జెం టీనా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ పరాజయాలను ఎదుర్కొంది. ఇంగ్లాండ్ విజయాలను సాధించగా, ఆస్ట్రేలియా ఒక మ్యాచ్‌లో గెలిచింది.
థాయ్ సంచలనం
మరో లీగ్ మ్యాచ్‌లో జపాన్‌పై థాయలాండ్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. అత్యంత కీలకమైన మ్యాచ్‌లో జపాన్‌ను 37-33 పాయంట్ల తేడాతో ఓడించి, సెమీ ఫైనల్ చేరింది. చాలాసేపు ఆధిక్యాన్ని కొనసాగించిన జపాన్‌కు థాయలాండ్ గట్టిపోటీనిచ్చింది. దీనితో ఇరు జట్ల మధ్య తేడా ఒకటిరెండు పాయంట్లకు మించలేదు. ఈ మ్యాచ్ లో ఓటిపాలైంది. పూల్-బి నుంచి ఇరాన్‌తోపాటు కెన్యాకు సెమీస్‌లో స్థానం దక్కేది. కానీ, అత్యంత కీలక మ్యాచ్‌ని గెల్చుకున్న థాయలాండ్ సెమీస్ చేరింది. ఫైనల్‌లో స్థానం కోసం పటిష్టమైన భార త్‌ను ఎదుర్కొంటుంది. ఈ పూల్‌లో ఇరాన్‌తో స మానంగా ఐదు మ్యాచ్‌ల్లో థాయ్ నాలుగు విజ యాలను సాధించడం విశేషం. మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన కెన్యా, చెరి రెండు విజయాలను నమోదు చేసిన జపాన్, పోలాండ్ జట్లు టోర్నీ నుంచి ని ష్క్రమించాయ. ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సా ధించలేకపోయన అమెరికా సెమీస్ ఆశలకు ఆరం భంలోనే తెరపడింది.
ఈ టోర్నీలో గురువారం విశ్రాంతి దినంకాగా, శుక్రవారం రెండు సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరుగు తాయ. మొదటి మ్యాచ్‌లో దక్షిణ కొరియా, ఇరాన్ జట్లు తలపడతాయ. రెండో మ్యాచ్ థాయలాండ్, భారత్ జట్ల మధ్య జరుగుతుంది. భారత్ డిఫెం డింగ్ చాంపియన్‌కాగా, గట్టిపోటీనిస్తుందని అను కున్న పాకిస్తాన్‌ను నిర్వాహకులు ఆహ్వానించలే దు. సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రే రేపిస్తున్న పాక్‌తో క్రీడా సంబంధాలను కొనసాగిం చ రాదని భారత్ నిర్ణయంచుకోవడం, ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొనడం వం టి కారణాలతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసు కున్నారు. టోర్నమెంట్ మొట్టమొదటి మ్యాచ్‌లోనే భారత్‌పై సంచలన విజయాన్ని సాధించిన కొరి యా చివరి వరకూ అదే ఒరవడిని కొనసాగించిం ది. ఐదు మ్యాచ్‌లు ఆడి, అన్నింటిలోనూ విజయా లు సాధించింది. మొదటి మ్యాచ్ ఫలితంతో కం గుతిన్న భారత్ ఆతర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌లను గెల్చుకుంది. కాగా, గత ప్రపంచకప్ పోటీల్లో మూడో స్థానాన్ని ఆక్రమించిన బంగ్లా ఈ సారి సెమీస్ కూడా చేరుకోలేదు.