క్రీడాభూమి

రికార్డు హాఫ్ సెంచరీ కొలిన్ మున్రో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, జనవరి 10: ఆస్ట్రేలియాతో జరిగే ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో కనీసం ఒక మ్యాచ్‌ని గెలిస్తేనే భారత జట్టు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానాన్ని నిలబెట్టుకోగలుగుతుంది. పాయింట్ల పట్టికలో ఆసీస్ మొత్తం 127 పాయింట్లు సంపాదించి అగ్రస్థానాన్ని ఆగ్రమించింది. భారత్ 114 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా అన్ని మ్యాచ్‌లనూ కోల్పోయినా పాయింట్లు తగ్గుతాయిగానీ నంబర్ వన్ స్థానంలోనే కొనసాగుతుంది. అయితే, భారత్ కనీసం ఒక మ్యాచ్‌ని గెలిస్తే రెండో స్థానాన్ని నిలబెట్టుకుంటుంది. లేకపోతే, దక్షిణాఫ్రికా రెండో స్థానానికి దూసుకెళితే, టీమిండియా మూడో స్థానానికి పడిపోతుంది. అక్కడ న్యూజిలాండ్ నుంచి పోటీని తట్టుకోవాలి. పాకిస్తాన్‌పై కివీస్ విజయాలను నమోదు చేస్తే, భారత్ నాలుగో స్థానానికి చేరుతుంది.