క్రీడాభూమి

ఐపిఎల్ మీడియా హక్కుల టెండర్ల ప్రక్రియ వాయదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలపై హక్కులను ఇచ్చేందు కు నిర్వహించాల్సిన టెండర్ల ప్రక్రి యను వాయదా వేస్తున్నట్టు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ప్రకటించింది. దీనికి సంబం ధించిన మార్గదర్శకాలను లోధా ప్యానెల్ ఇంకా వి డుదల చేయకపోవడంతో, గత్యంతరం లేక ఈ ని ర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. దేశవిదేశాల నుం చి బిడ్ రేసులో ఉన్న 18 సంస్థలకు క్షమాపణ చె ప్పింది. ఐపిఎల్ టోర్నీ టీవీ ప్రసారాలతోపాటు ఇంటర్నెట్, మొబైల్ నెట్ వర్క్ హక్కులను కేటాయించడానికి బిడ్స్‌ను ఆహ్వానించిన బిసిసిఐ ఇటీవ ల సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకొని మార్గదర్శకాలను సూచించాలని లోధా కమిటీని కోరింది. అయతే, అసలు ఎంతకాలానికి ఈ బిడ్స్‌ను ఆహ్వానిస్తున్నారు? ఇప్పటి వరకూ అ నుసరించిన విధానాలు ఏమిటి? ఈసారి హక్కుల కేటాయంపు కోసం పాటిస్తున్న నిబంధనలు ఏమి టి? అంటూ బిసిసిఐకి కమిటీ చైర్మన్ ఆర్‌ఎం లోధా లేఖ రాశారు. దీనితో మంగళవారం నాడు జరగాల్సి న బిసిసిఐ సమావేశానికి ఎలాంటి ప్రాధాన్యత లే కుండా పోయంది. దేశంలో క్రికెట్ పారదర్శకత కోసం తాము చేసిన సిఫార్సులను అమలు చేసి తీరాల్సిందేనని, లేకపోతే, వదులుకోవాల్సిందేనని లోధా కమిటీ ఇదివరకే హెచ్చరించిన విషయం తెలి సిందే. ఈ నేపథ్యంలోనే, మంగళవారం జరిగే స మావేశంలో బిడ్స్‌పై చర్చ జరగాల్సి ఉండింది. అ యితే, ఈ హక్కుల కేటాయింపు అంశాన్ని పర్యవేక్షించే బాధ్యతను లోధా కమిటీకే సుప్రీం కోర్టు అప్పచెప్పడంతో బిసిసిఐ సమావేశం నామమాత్ర మైంది. నిజానికి ఈనెల 21న లోధా కమిటీ సమావేశం కావాల్సి ఉంది. కానీ, కమిటీలోని ముగ్గురు సభ్యులు వేరువేరు నగరాల్లో ఉండడం వల్ల, న్యూఢిల్లీకి వచ్చేందుకు తగినంత సమయం లేకపోవడంతో ఆ సమావేశం వాయిదా పడింది. ఐపిఎల్ మ్యాచ్‌ల ప్రసార హక్కులపై బిడ్స్ ఏ విధంగా ఉండాలి? బిడ్స్‌ను ఆమోదించే సమయాల్లో ఎలాంటి నిబంధనలను అనుసరించాలి? వంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిందిగా లోధా ప్యానెల్‌ను బిసిసిఐ కోరితే, మీరు అనుసరించబోయే వి ధానాలు వివరించాలని బోర్డును లోధా కమిటీ ఎ దురు ప్రశ్నించింది. ఈ పరిస్థితుల్లో టెండర్ల ప్రక్రి యను నిరధికంగా వాయదా వేయడం తప్ప బోర్డు కు మరో మార్గం లేకుండాపోయంది.
ఏం చేయాలి?
ఐపిఎల్ టోర్నీ ప్రసార హక్కులపై లోధా ప్యానెల్ ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ఏం చేయాలనే ప్రశ్న బిసిసిఐ అధికారులను వేధిస్తున్నది. 2017 వరకూ ఈ హక్కులు సోనీ ఎంటర్‌టైనె్మంట్ సంస్థ వద్దే ఉంటాయి. 2018 నుంచి పదేళ్ల కాలానికి బిడ్స్‌ను పిలిచి, హక్కులను ఇవ్వాలని బిసిసి తీర్మానించింది. కానీ, ఈ మొత్తం వ్యవహారాలను పరిశీలించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు బిసిసిఐకి సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కమిటీని నియమించే బాధ్యతను లోధా కమిటీ చీఫ్ ఆర్‌ఎం లోధాకు అప్పగించింది. ఈ ప్యానెల్ ఇంకా సమావేశం కాలేదు. కమిటీని ప్రకటించలేదు. దీనితో లోధానే స్వయంగా ఐపిఎల్ ప్రసార హక్కుల వ్యవహారాలు పర్యవేక్షిస్తాడన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అదే నిజమైనా, ఇంత వరకూ మార్గదర్శకాలను వెల్లడి చేయకపోవడంతో బిసిసిఐ దిక్కుతోచని స్థితిలో, మొత్తం బిడ్స్ వ్యవ హారానే్న వాయదా వేసేసింది.