క్రీడాభూమి

‘ముస్తాక్ అలీ’ నాకౌట్‌కు గోవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడోదర, జనవరి 10: ముస్తాక్ అలీ క్రికెట్ టోర్నమెంట్‌లో గోవా జట్టు నాకౌట్‌కు చేరింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు ఆంధ్రను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర 20 ఓవర్లలో 7 వికెట్లకు 97 పరుగులు చేసింది. అనంతరం గోవా 14.5 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి 98 పరుగులు సాధించి, 31 బంతులు మిగిలి ఉండగానే విజయభేరి మోగించి నాకౌట్‌కు దూసుకెళ్లింది.
ఇతర మ్యాచ్‌ల్లో ఫలితాలు ఇలావున్నాయ. అస్సాంను ఐదు వికెట్లతో ఓడించిన మధ్యప్రదేశ్ కూడా నాకౌట్‌లోకి అడుగుపెట్టింది. అస్సాం 20 ఓవర్లలో 6 వికెట్లకు 138 పరుగులు చేయగా, మధ్యప్రదేశ్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసి విజయం సాధించింది.
హర్యానాను గుజరాత్ 9 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. హర్యానా 95 పరుగులకు ఆలౌట్‌కాగా, గుజరాత్ 6.4 ఓవర్లలో, ఒక వికెట్ నష్టపోయి 99 పరుగులు చేసింది. 80 బంతులు మిగిలి ఉండగానే ఈ జట్టు విజయభేరి మోగించడం విశేషం.
తమిళనాడు చేతిలో హైదరాబాద్ నాలుగు వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 140 పరుగులు చేయగా, అనంతరం తమిళనాడు 18.4 ఓవర్లలో ఆరు వికెట్లకు 141 పరుగులు చేసి గెలిచింది.
సౌరాష్ట్ర 19 పరుగుల ఆధిక్యంతో పంజాబ్‌పై విజయాన్ని నమోదు చేసింది. సౌరాష్ట్ర 20 ఓవర్లలో 5 వికెట్లకు 167 పరుగులు సాధించగా, అందుకు సమాధానంగా పంజాబ్ 19.2 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది.
అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో బరోడాను ఢిల్లీ 5 వికెట్ల తేడాతో ఓడించింది. బరోడా ఆరు వికెట్లకు 153 పరుగులు చేయగా, ఢిల్లీ మరో మూడు బంతులు మిగిలి ఉండగా, ఐదు వికెట్లకు 156 పరుగులు సాధించి విజయాన్ని అందుకుంది.
విదర్భ 27 పరుగుల ఆధిక్యంతో హిమాచల్ ప్రదేశ్‌పై గెలిచింది. విదర్భ 6 వికెట్లకు 183 పరుగులు చేయగా, హిమాచల్ ప్రదేశ్ 19.5 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌటైంది.
మరో మ్యాచ్‌లో రాజస్థాన్ 45 పరుగుల తేడాతో జమ్మూ-కశ్మీర్‌ను ఓడించింది. 20 ఓవర్లలో 5 వికెట్లకు 174 పరుగులు చేసిన గుజరాత్ అనంతరం జమ్మూ-కశ్మీర్‌ను 7 వికెట్లకు 129 పరుగులకు కట్టడి చేసింది.
జార్ఖండ్ ఆరు వికెట్ల తేడాతో కేరళపై గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేరళ 6 వికెట్లకు 169 పరుగులు చేయగా, జార్ఖండ్ 19 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసి, విజయాన్ని నమోదు చేసింది.