క్రీడాభూమి

ఫ్రెంచ్ ఓపెన్ బాడ్మింటన్ ప్రణీత్ అవుట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, అక్టోబర్ 27: ఫ్రెంచ్ ఓపెన్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాడు సాయి ప్రణీత్ తొలి రౌండ్‌లోనే ఓటమిపాలయ్యాడు. అయితే, అతను కనబరచిన పోరాటపటిమ అభిమానులను ఆకట్టుకుంది. కొరియాకు చెందిన లీ హ్యున్ ఈతో జరిగిన మ్యాచ్‌లో చివరి వరకూ శ్రమించి అతను 21-15, 8-21, 19-21 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. ఈ ఏడాది జూలైలో కనడా ఓపెన్ గ్రాండ్ ప్రీని కైవసం చేసుకున్న ప్రణీత్ తనపై అభిమానులు పెట్టుకున్న నమ్మకానికి తగ్గట్టే సర్వశక్తులు ఒడ్డాడు. అయితే, అంతర్జాతీయ వేదికలపై ఎంతో అనుభవం ఉన్న హ్యున్‌ను నిలువరించలేకపోయాడు.