క్రీడాభూమి

భారత్‌కు జట్టును పంపాలా? వద్దా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, అక్టోబర్ 27: భారత్‌కు జూనియర్ హాకీ జట్టును పంపాలా? వద్దా? అన్నది తేల్చాల్సిందిగా కోరుతూ ప్రభుత్వానికి పాకిస్తాన్ హాకీ సమాఖ్య (పిహెచ్‌ఎఫ్) లేఖ రాసింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) జూనియర్ ప్రపంచ కప్ పోటీలు ఈ ఏడాది డిసెంబర్ 8 నుంచి 18వ తేదీ వరకు లక్నోలో జరగనున్నాయి. భారత్, పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుక్ను నేపథ్యంలో, జూనియర్ వరల్డ్ కప్ టోర్నీకి జట్టును పంపాలో లేదో తెలియక పిహెచ్‌ఎఫ్ మల్లగుల్లాలు పడుతున్నది. ప్రభుత్వ అనుమతి లేకపోతే, భారత్‌కు జట్టు ను పంపడం సాధ్యం కాదని, అందుకే సర్కారుకు లేఖ రాశామని పిహెచ్‌ఎఫ్ ఒక ప్రకటనలో తెలిపిం ది. కాగా, రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలకు తెరపడిన తరుణంలో, టోర్నీకి జూనియర్ హాకీ జట్టు వచ్చే అవకాశం లేదు.