క్రీడాభూమి

డోప్ పరీక్షలో చిక్కిన ‘బంగారు భామలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాసనే్న, అక్టోబర్ 27: లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలను సాధించిన ముగ్గురు కజకిస్థాన్ మహిళా వెయట్‌లిఫ్టర్లు డోప్ పరీక్షలో పట్టుబడ్డారు. వారు సాధించిన పతకాలను వాపసు తీసుకుంటున్నట్టు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) ప్రకటించింది. 2012 లండన్ ఒలింపిక్స్ మహిళల 53 కిలోల విభాగంలో జుల్ఫియా చిన్‌షాన్లో, 63 కిలోల విభాగంలో మైయా మనెజా, 75 కిలోల విభాగంలో స్వెత్లానా పొడొబెడొవా స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు. అయతే, వీరు నిషిద్ధ మాదక ద్రవ్యం స్టానజోల్‌ను వాడినట్టు డోప్ పరీక్షలో వెల్లడైనట్టు ఐఒసి తెలిపింది. వీరిని వెయట్‌లిఫ్టింగ్ నుంచి సస్పెండ్ చేశామని, ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని ఆ ప్రకటనలో పేర్కొంది. అదే విధంగా వారి పతకాలను రద్దు చేసినట్టు తెలిపింది. అదే విధంగా 69 కిలోల విభాగంలో కాంస్య పతకం అందుకున్న బెలారస్ లిఫ్టర్ మరినా షెకెమన్కొవా సైతం డోప్ పరీక్షలో విఫలమైనట్టు ఐఒసి వివరించింది. ఆమెను కూడా సస్పెండ్ చేశామని, పతకాన్ని వెనక్కు తీసుకుంటామని స్పష్టం చేసింది. కాగా, లండన్ ఒలింపిక్స్‌లో విజేతలుగా నిలిచిన అథ్లెట్లకు సంబంధించి మొత్తం 1,240 శాంపిల్స్‌ను అత్యాధునిక పరికరాల సాయంతో పరీక్షించారు. దీనితో డోప్ దోషుల వివరాలు బయటకు వస్తున్నాయ. ఇంత వరకూ 98 మందిని ఐఒసి అధికారికంగా గుర్తించింది. వారిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇంకా చాలా మంది ఈ జాబితాలో చేరుతారని అధికారులు అంటున్నారు. లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకం గెల్చుకున్న బెసిక్ కుడొనొవ్ కూడా డోప్ పరీక్షలో విఫలమైనప్పటికీ, అతను 2013లో మృతి చెందడంతో కేసు మూసివేశారు.