క్రీడాభూమి

డిఫెండర్‌సురేందర్‌పై సస్పెన్షన్ వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కువాంటన్ (మలేసియా), అక్టోబర్ 27: భారత డిఫెండర్ సురేందర్ కుమార్‌పై రెండు మ్యాచ్‌ల సస్పెన్షన్ వేటు పడింది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో ఆడుతున్న సురేందర్ మలేసియాతో జరిగిన మ్యాచ్‌లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడని, అందుకే అతనిని రెండు మ్యాచ్‌ల నుంచి సస్పెండ్ చేస్తున్నామని ఆసియా హాకీ సమాఖ్య సాంకేతిక విభాగం పరిశీలకుడు రమేష్ అప్పూ ఒక ప్రకటనలో తెలిపాడు. మలేసియాతో తలపడినప్పుడు ప్రత్యర్థి ఆటగాడు బంతిని కొట్టడానికి ముందే సురేందర్ వేగంగా ముందుకు వెళ్లాడని, దీనితో అంపైర్ అతనిని ‘ఆఫ్ సైడ్’గా ప్రకటించాడని రమేష్ తతన ప్రకటనలో వివరించాడు. ఈ సంఘటనతో జాగ్రత్త పడాల్సిన సురేందర్ అందుకు భిన్నంగా వ్యవహరించి, హాకీ స్టిక్‌ను బలంగా గాల్లో తిప్పాడని, దీనితో మలేసియా ఆటగాడికి గాయమైందని పేర్కొన్నాడు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన సురేందర్‌ను సస్పెండ్ చేశామన్నాడు. కాగా, సస్పెన్షన్ కారణంగా సెమీస్‌సహా నాకౌట్ మ్యాచ్‌ల్లో సురేందర్ ఆడే అవకాశం ఉండదు. ఒకవేళ సెమీస్‌లోనే భారత్ ఓడితే, మరో అంతర్జాతీయ టోర్నీ వరకూ ఈ సస్పెన్షన్ కొనసాగుతుంది.

చిత్రం.. సురేందర్ కుమార్