క్రీడాభూమి

భారత్ ప్రత్యర్థి కొరియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కువాంటన్, అక్టోబర్ 27: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ సెమీ ఫైనల్స్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత్ మరోసారి తలపడే అవకాశానికి తెరపడింది. చైనాతో గురువారం జరిగిన మ్యాచ్‌ని పాకిస్తాన్ గెల్చుకోగా, కొరియా, మలేసియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీనితో, లీగ్ దశ పూర్తయ్యే సమయానికి భారత్ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించగా, మలేసియా, పాకిస్తాన్, కొరియా జట్లు వరుసగా రెండు నుంచి నాలుగు స్థానాల్లో నిలిచి, సెమీస్ పోరుకు సిద్ధమవుతున్నాయి. చివరి రెండు స్థానాల్లో ఉన్న చైనా, జపాన్ జట్లు నిష్క్రమించాయి.
లీగ్ దశలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకానొక దశలో వెనుకబడినప్పటికీ, ఆతర్వాత పుంజుకున్న భారత్ 3-2 తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. టోర్నమెంట్ ఫార్మాట్‌ను అనుసరించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించిన జట్టుతో నాలుగో స్థానంలోని జట్టు తలపడుతుంది. మరో సెమీ ఫైనల్ రెండు, మూడు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య జరుగుతుంది. సోమవారం నాటి మ్యాచ్‌లు ముగిసే సమయానికి పాకిస్తాన్ నాలుగో స్థానంలో నిలవడంతో చివరి రోజు మ్యాచ్‌లు ఆసక్తిని రేపాయి. చైనాతో జరిగిన చివరి లీగ్‌లో పాకిస్తాన్ ఓడితే, సెమీ ఫైనల్‌లో భారత్‌ను ఢీకొనే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. కానీ, కీలకమైన ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్ 4-0 తేడాతో చైనాను చిత్తుచేసింది. అబ్దుల్ ఖాన్ (21, 31 నిమిషాలు) రెండు గోల్స్ చేయగా, అలీ షాన్, మహమ్మద్ ఇర్ఫాన్ జూనియర్ (48వ నిమిషం) 60 సెకన్ల వ్యవధిలోనే చెరొక గోల్ సాధించారు. పాక్ దూకుడుతో ప్రేక్షక పాత్రకు పరిమితమైన చైనా ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది.
చివరి లీగ్ మ్యాచ్ డ్రా
ఈ టోర్నమెంట్ చివరి లీగ్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. వ్యూహాత్మకంగా ఆడిన మలేసియా, కొరియా జట్లు చెరొక గోల్ చేశాయి. కొరియాకు 37వ నిమిషంలో జున్‌వూ జియాంగ్ గోల్‌ను సాధించిపెట్టగా, మలేసియా తరఫున రహీం రజీ 56వ నిమిషంలో ఈక్వెలైజర్‌ను అందించాడు. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందే ఈ రెండు జట్లు సెమీస్ స్థానాన్ని ఖాయం చేసుకున్నాయి. దీనితో ఎలాంటి ఒత్తిడి లేకుండా, డ్రా చేసుకోవడమే లక్ష్యంగా ఆడాయి. సెమీస్ పోరాటానికి దీనిని ప్రాక్టీస్ మ్యాచ్‌గా భావించిన మలేసియా, కొరియా ఎలాంటి ఆర్భాటం లేకుండా డ్రాతో సంతృప్తి చెందాయి.